టెక్నాలజీ ప్రభావంతో యువత మత్తుకి బానిసవుతోంది. వ్యసనాలకు అలవాటు పడిన యువత మత్తు కోసం కొత్తగా అడ్డదారులు తొక్కుతున్నారు. గంజాయి, ధూమపానం, మధ్యం కు కొందరు అలవాటుపడిన కొందరు జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటుంటే… మరికొందరు ఆమత్తులోనే అంతకు మించి పోకడలకు అలవాటుపడి మరింత దిగజారడం ఆందోళన కలిగిస్తుంది. మత్తు కొసం కొత్త పుంతలు తొక్కుతుంది యువత. కొకైన్, హెరాయిన్, గంజాయి, మద్యం, ధూమపానాలకు బానిసలు అవుతుంటే… మరికొందరు అంతకుమించి కొత్త పోకడలను ఎంచుకోవడం ఆందోళన కలిగిస్తుంది.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండ గూడెం శివారులో 12 మంది యువకులు కోడిన్ ఫాస్పేట్ ఉండే దగ్గు మందును మత్తు కొసం సోడాలో కలుపుకొని తాగుతుండటం ఆందోళన కలిగిస్తుంది…. ఈమేరకు విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుండి అధిక సంఖ్యలో దగ్గు మందు సీసాలను స్వాధీనం చేసుకోవడం ఇప్పుడు కలకలం రేపుతుంది. కాగా యువకుల తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి కేసు నమోదు చేశారు….షెడ్యూల్ హెచ్ వన్ డ్రగ్ కేటగిరీకి చెందిన టోస్సేక్స్ మందును తీవ్రమైన దగ్గు, జలుబు సమస్యలకు కొన్ని కీలక సందర్భాలలో మాత్రమే వైద్యులు రోగికి రాసిస్తారు.
పెద్దలకు 10ml, చిన్నారులకు 2.5 ml చొప్పున మాత్రమే డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడాలి. క్లోరో ఫినేయమైన్ 4mg, కోడిన్ 10mg డ్రగ్ తో ఈ మందును డ్రగ్స్ కంపెనీలు తయారు చేస్తున్నాయి తీవ్రమైన జబ్బుకు వాడాల్సి ఉంటుంది. కానీ 100 ml బాటిల్ ను రోజుకు రెండు లేదా మూడు బాటిల్స్ సాగుతూ అధిక మొత్తంలో మత్తును యువకులు ఆస్వాదిస్తుండం ఆందోళన కలిగిస్తుంది. ఈ దగ్గు మందుకు అలవాటు పడిన యువకులు అందులోనూ మైనర్లు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. మోతాదుకు మించి ఈ డ్రగ్ తీసుకుంటే కిడ్నీ వ్యాధి, లివర్ సమస్యలు.. రావడంతో పాటు వ్యాధి నిరోధక శక్తి తగ్గడం గుండె సంబంధిత వ్యాధులు సంభవించడంతోపాటు మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
Read Also: Madhya Pradesh High Court: ఇద్దరు మహిళలు కలిసి జీవించాలనుకుంటే.. కలిసి ఉండొచ్చు.
కొన్ని కంపెనీలు సరఫరా చేస్తున్న దగ్గు మందులలో కొడైన్ ఫాస్ఫేట్ అనే డ్రగ్ మోతాదు అధికంగా ఉంటుంది. ఈ మందులను కేవలం వైద్యశాఖ అనుమతులతో మెడికల్ దుకాణ దారులు నిల్వచేసుకోవాలి. రోగికి వైద్యులు ప్రిస్క్రిప్షన్ రాసిస్తేనే ఆ మందును మెడికల్ షాప్ వారు కస్టమర్లకు సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని దుకాణాలు ఎలాంటి నిబంధనలు పాటించకుండా.. అధిక డబ్బుకు ఆశపడి కస్టమర్లకు విక్రయిస్తున్నారు. అందులోనూ కొందరు షాపుల యజమానులు యువతను లక్ష్యం చేసుకుని ఫాస్పేట్ డ్రగ్ గల కాఫ్ సిరప్ లను సరఫరా చేస్తున్నాయి. వైద్యశాఖ నిర్లక్ష్యం, డ్రగ్ ఇన్స్ పెక్టర్ తనిఖీలు చేయకపోవడంతో మెడికల్ షాపుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. యువకులు, విద్యార్థులు రోజు దగ్గు మందు సీసాలను తాగి మత్తులో ఊగిపోతున్నారు.
ఇటీవల సూర్యాపేట జిల్లా కోదాడ పరిధిలో ఓ యువకుడు ఈ మత్తుకు బానిస కావడం… అతడి ఆరోగ్యం పూర్తిగా క్షణించడంతో ఈ మందు వాడకం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఈ మందును వాడుతున్న 16 నుండి 22 ఏళ్ల వయసు లోపు 12 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు.. వీరందరినీ విచారించిన సందర్భంలో పోలీసులకు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువకుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి కేసు నమోదు చేశారు. దాదాపు ఏడాదిన్నర నుండి యువకులు ఈ మత్తుకు అలవాటు పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. తల్లిదండ్రులు పిల్లల వ్యవహార శైలి పట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని వారి వ్యవహారశైలిని, కదలికలను గమనించాలని పోలీసులు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Also: Bandi Sanjay Hot Comments: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో.. సీఎం, హోంమంత్రులను సాక్షిగా చేర్చాల్సిందే