NTV Telugu Site icon

Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ స‌ర్జ‌రీ సక్సెస్.. బరిలోకి దిగేది ఎప్పుడంటే?

Surya Surgery

Surya Surgery

Suryakumar Yadav Surgery: టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ స‌ర్జ‌రీ సక్సెస్ అయింది. స్పోర్ట్స్ హెర్నియా సమస్యతో బాధప‌డుతున్న సూర్య.. శ‌స్త్రచికిత్స కోసం ఇటీవల జర్మనీ వెళ్లాడు. బుధవారం అతడికి వైద్యులు సర్జరీ చేశారు. స‌ర్జ‌రీ అనంతరం ఆస్పత్రి బెడ్‌పై ఉన్న తన ఫొటోను సూర్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. అతి త్వరలో పునరాగమనం చేస్తా అని పేర్కొన్నాడు.

‘శస్త్రచికిత్స జరిగింది. నా ఆరోగ్యం గురించి ఆరా తీసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. అతి త్వరలో పునరాగమనం చేస్తా’ అని సూర్యకుమార్ యాదవ్ తన పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చాడు. 2023 డిసెంబర్ 14న జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన 3వ టీ20లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు సూర్య ఎడమ చీలమండకు గాయమైంది. రెండు రోజుల క్రితం శ‌స్త్రచికిత్స కాగా.. పూర్తి ఫిట్‌నెస్‌ సాదించేందుకు కనీసం ఒక నెల పడుతుందని తెలుస్తోంది. దాంతో ఐపీఎల్ 2024లో సూర్య ఆడనున్నాడు. ఆరంభ మ్యాచులు కాకపోయినా.. రెండో లెగ్ సమయానికైనా అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంది. టీ20 ప్రపంచకప్ 2024లో సూర్య ఆడనున్నాడు.

Also Read: Ys Raja Reddy Engagement: షర్మిల కొడుకు ఎంగేజ్మెంట్ ఫొటోస్ చూశారా..?

టీ20 ప్రపంచకప్‌ 2024లో టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ కీలక ప్లేయర్. ఎందుకంటే గత రెండేళ్లలో పొట్టి క్రికెట్‌లో సూర్య అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. 57 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలు, 17 అర్ధ సెంచరీలు సాధించాడు. 171.55 స్ట్రైక్ రేట్‌తో 2,141 పరుగులు చేశాడు. మిడిలార్డర్‌లో భారీ స్కోర్ సాధించే సూర్యకుమార్ పునరాగమనం టీమిండియాకు అనివార్యం. జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభం కానుంది.

Show comments