Karuppu: త్రిష వల్లే ‘కరుప్పు’ సినిమాకు కొత్త ఎనర్జీ వచ్చిందంటూ దర్శకుడు ఆసక్తికర కామెంట్స్

Suriya And Trisha's Veerabhadrudu

Suriya And Trisha's Veerabhadrudu

స్టార్ హీరో సూర్య, ఆర్జే బాలాజీ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘కరుప్పు’. ఈ సినిమాను తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. మే 14న బాక్సాఫీస్ వద్ద గర్జించబోతున్న ఈ సినిమా గురించి తాజాగా దర్శకుడు బాలాజీ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిషను ఎంపిక చేయడం వెనుక ఉన్న కథను బాలాజీ పంచుకున్నారు.

Also Read : Ek Din: సాయి పల్లవి ‘ఏక్ దిన్’ ట్రైలర్.. ఒక్క రోజు ప్రేమ కోసం హీరో పోరాటం!

‘నేను త్రిషతో గతంలోనే ఒక సినిమా చేయాల్సింది, కానీ అది కుదరలేదు. ‘కరుప్పు’ స్క్రిప్ట్ వినగానే ఆమె వెంటనే ఓకే చెప్పారు. సూర్య-త్రిష జోడీని మళ్ళీ 22 ఏళ్ల తర్వాత (ఆరు సినిమా తర్వాత) స్క్రీన్‌పై చూడటం అభిమానులకు పెద్ద విందు కానుంది. షూటింగ్ పూర్తయినా త్రిష సెట్స్‌కు వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు’ అని బాలాజీ తెలిపారు. అలాగే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మొదట ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్‌ను అనుకున్నారట దాని గురించి కూడా మాట్లాడుతూ.. ‘నేను, రెహమాన్ సార్ కలిసి వర్క్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. కానీ ‘కరుప్పు’ షూటింగ్ మొదలైన సమయంలో ఆయన కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ‘నేను ఈ సినిమాకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేను’ అని ఆయన చెప్పినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఆ సమయంలో ఒక పాట అత్యవసరం కావడంతో, సాయి అభ్యంకర్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నాము’ అని బాలాజీ వివరించారు.