Surya Kumar Yadav: దుబాయ్‌లో ఆసియా కప్ 2025 ను భారత్ కైవసం చేసుకుంది. ఇక టోర్నీని గెలిచిన తర్వాత ట్రోఫీని తిరస్కరించిన సంఘటనపై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. జట్టు మొత్తం టోర్నమెంట్‌లో కష్టపడి విజయం సాధించిందని, అయితే ట్రోఫీని అందుకోలేకపోవడం బాధ కలిగించిందని అన్నాడు. “నేను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పటి నుంచి, ఒక ఛాంపియన్ జట్టుకు ట్రోఫీని ఇవ్వకపోవడం ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నాడు. అలాగే నాకు తెలిసి ఇలా చేయడం ఇదే మొదటిసారి అని అన్నారు. మేము కష్టపడి ఈ విజయాన్ని సాధించాం. టోర్నమెంట్‌లో వరుసగా ఏడు మ్యాచ్‌లు గెలిచామని సూర్యకుమార్ పేర్కొన్నారు.
Sohani Kumari: నటి కాబోయే భర్త ఆత్మహత్య.. తప్పు చేశానంటూ సెల్ఫీ వీడియో
ట్రోఫీని తిరస్కరించిన విషయంపై పాకిస్థాన్ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సూర్యకుమార్ చాలా కూల్ గా, భావోద్వేగంతో సమాధానమిచ్చారు. ట్రోఫీ గురించి మీరు అడిగితే.. దానికి, నా అసలైన ట్రోఫీలు నా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నాయి. నా 14 మంది సహచరులు, సహాయక సిబ్బందే నా రియల్ ట్రోఫీలు అంటూ భావోద్వేగంతో సంభాషించారు. నేను ఈ టోర్నమెంట్ నుండి గుర్తుంచుకునే అసలైన క్షణాలు అవే.. విజయం సాధించిన తర్వాత, ఛాంపియన్లే గుర్తుంటారు, ట్రోఫీ ఫోటో కాదని సూర్యకుమార్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. అంతేకాకుండా, తాము ఏసీసీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని తీసుకోకూడదని ఎవరి నుండి ఆదేశాలు రాలేదని, అది తామే మైదానంలో తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు.
Sai Abhyankkar : ఫస్ట్ సినిమాతోనే రికార్డు కొల్లగొట్టిన సాయి అభ్యంకర్
అంతేకాకుండా.. సూర్యకుమార్ యాదవ్ ఒక కీలక ప్రకటన చేశారు. ఈ ఆసియా కప్‌లో తనకు లభించిన మ్యాచ్ ఫీజు మొత్తాన్ని భారత ఆర్మీకి విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంపై ఆయనకు సోషల్ మీడియాలో పెద్దెత్తున ప్రశంసలు వస్తున్నాయి. భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ తర్వాత హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్ వంటి ఆటగాళ్లు తమ సోషల్ మీడియాలో ట్రోఫీని ఎడిట్ చేసి పోస్ట్ చేశారు.
When the game is done, only the champions will be remembered and not the picture of a 🏆 pic.twitter.com/0MbnoYABE3
— Surya Kumar Yadav (@surya_14kumar) September 28, 2025
