Sai Abhyankkar : ఫస్ట్ సినిమాతోనే రికార్డు కొల్లగొట్టిన సాయి అభ్యంకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నయా సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. జస్ట్ ప్రైవేట్ ఆల్బమ్స్‌తోనే ఓవర్ నైట్ బిజియెస్ట్ కంపోజర్‌గా మారిపోయాడు. ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలోనూ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. తను కంపోజ్ చేసిన ఫస్ట్ ఫిల్మ్, మాలీవుడ్ మూవీ బాల్టీ ఈ శుక్రవారమే రిలీజై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మ్యూజిక్ అండ్ బీజీఎంకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ మూవీ కోసం అభ్యంకర్ రూ. 2 కోట్లు చార్జ్ చేశాడు.
Also Read : Sai Pallavi : కోలీవుడ్‌కు దూరంగా సాయి పల్లవి.. కారణం ఏంటి?
Also Read
సాయి అభ్యంకర్కు రూ. 2 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు బాల్టీ ప్రొడ్యూసర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. సాయికి ఉన్న క్రేజ్, డిమాండ్ బట్టే అంత అమౌంట్ ఇచ్చామని క్లారిటీ ఇచ్చాడు. తమ సినిమా కమిట్ అవ్వడానికి ముందే అతడి చేతిలో పది సినిమాలు ఉన్నాయన్నారు. అయితే మాలీవుడ్‌లో ఇది రికార్డ్ రెమ్యునరేషన్. ఇప్పటి వరకు మాలీవుడ్‌లో ఏ కంపోజర్ ఇంత రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలుస్తోంది. పేరెంట్స్ టిప్పు, హరిణి సెలబ్రిటీలైనా, తన టాలెంట్‌తోనే గుర్తింపు తెచ్చకున్నాడు సాయి అభ్యంకర్. ప్రైవేట్ ఆల్బమ్స్‌తో మ్యూజిక్ సెన్సేషన్‌గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాతే ఈ యంగ్ కంపోజర్‌కి మొదటి అవకాశం వచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్- అట్లీ భారీ బడ్జెట్ ఫిల్మ్‌కు బాణీలు సమకూర్చే గోల్డెన్ ఛాన్స్ అందుకున్నాడు. ఇవే కాకుండా తమిళంలో డ్యూడ్, కరుప్పు, బెంజ్, శింబు49 , మార్షల్ చిత్రాలతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ రెమ్యునరేషన్ , ప్రాజెక్ట్స్ చూస్తుంటే స్టార్ కంపోజర్స్ అనిరుధ్, తమన్, దేవీలకు గట్టి పోటీ ఇచ్చేట్లే కనిపిస్తున్నాడు.
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!