NTV Telugu Site icon

SKY: ఫైనల్స్లో కెప్టెన్ తనతో చెప్పిన మాటలను రివీల్ చేసిన సూర్య కుమార్..

Surya

Surya

రోహిత్ శర్మ సారథ్యంలో టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా అదరగొట్టింది. బార్బడోస్‌లో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని, 17 ఏళ్ల తర్వాత రెండో టీ20 ప్రపంచకప్‌ను భారత్‌ గెలుచుకుంది. కాగా.. ఫైనల్‌కు ముందు భారత ఆటగాళ్లను ఉత్సాహపరిచేందుకు కెప్టెన్ రోహిత్ చెప్పిన మాటలను స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు బయటపెట్టాడు.

Chandrababu Delhi Tour: ఢిల్లీ పర్యటనలో ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎం చంద్రబాబు కసరత్తు..

సూర్య కుమార్ మాట్లాడుతూ..’నేను ఒంటరిగా ఈ పర్వతాన్ని ఎక్కలేను. నేను అగ్రస్థానానికి చేరుకోవాలంటే, నాకు ప్రతి ఒక్కరి ఆక్సిజన్ కావాలి’. అని ఫైనల్స్ లో రోహిత్ ఆటగాళ్లకు చెప్పాడన్నారు. ‘మనం ఓడిపోకుండా ఉండేందుకు ఎక్స్ట్రార్డినరీ ప్రదర్శన చూపించాలని రోహిత్ చెప్పాడు’. అని సూర్య కుమార్ తెలిపాడు. ‘మన పాదాలు ఎక్కడున్నాయో అక్కడే మన మనసు ఉండాలి. అదే మన నినాదం’. అని రోహిత్ చెప్పినట్లు సూర్యకుమార్ తెలిపారు. అంతేకాకుండా.. రోహిత్ కెప్టెన్సీపై సూర్యకుమార్ ప్రశంసలు కురిపించారు. కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ.. “కష్టమైన పరిస్థితిలో రోహిత్ ఆటగాళ్లకు మద్దతు ఇస్తాడని.. ఆ క్రమంలో అతనికి ప్రతి ఒక్కరు విశ్వాసం, గౌరవం ఇస్తారని చెప్పాడు. మరోవైపు.. చివరలో డేవిడ్ మిల్లర్ క్యాచ్ సూర్య అద్భుతంగా పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాకుండా.. జట్టు విజయానికి ఈ క్యాచ్ ప్రధాన కారణం.

Tragedy: విషాదం.. చెరువులో మునిగి తల్లితో సహా ఇద్దరు కూతుళ్లు మృతి

ఈ విజయం గురించి సూర్యకుమార్ మాట్లాడుతూ.. ఈ క్యాచ్ ఎప్పటికీ గుర్తుంటుందని అన్నాడు. 2026లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో కూడా అలాంటి ఫీట్‌ను పునరావృతం చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. చాలా మంది ఆ క్యాచ్ చిత్రాన్ని తనకు పంపుతున్నారని తెలిపాడు “నేను దానిని రెండు సంవత్సరాలు నా వద్ద ఉంచుతాను” అని సూర్య చెప్పాడు. తదుపరి ప్రపంచకప్‌లో పునరావృతం చేస్తానని ధీమా వ్యక్తం చేశాడు.