NTV Telugu Site icon

Suriya: వామ్మో సూర్య ఇదేం స్పీడు.. మరీ డిసెంబర్ నుంచేనా ?

New Project 2024 10 12t071833.267

New Project 2024 10 12t071833.267

Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రజినీ కాంత్ తర్వాత తెలుగులో అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ కలిగిన కోలీవుడ్ హీరో. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ జనాలకు నిత్యం చేరువలో ఉంటున్నాడు. ప్రస్తుతం వరుస రిలీజ్ లు ప్లాన్ చేసాడా? అంటే అవుననే అనిపిస్తుంది. ఇప్పటికే తన కెరీర్లో 43వ చిత్రం `కంగువ` షూటింగ్ పూర్తయింది. ప్ర‌స్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. ఈ చిత్రాన్ని నవంబర్లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ లో ఉండ‌గానే కార్తీక్ సుబ్బరాజ్ తో44వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సినిమా షూటింగ్ కూడా తాజాగా పూర్తి కాబోతుంది. దాని తర్వాత వెంటనే 45వ చిత్రం షూటింగ్ కూడా షురూ కానుంది.

Read Also:India vs Bangladesh 3rd T20: నేడే బంగ్లాతో భారత్ చివరి మ్యాచ్‌.. ఉప్పల్లో క్లీన్స్వీప్ చేస్తారా..?

ఈ సినిమా సెట్స్లో ఉండ‌గానే ఆర్ జె బాలాజీని లైన్ లోకి తెచ్చి స్టోరీ విని ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇప్పుడా సినిమా షూటింగ్ డిసెంబ‌ర్ నుంచి షురూ కానుంది. ప్ర‌స్తుతం ఆ సినిమాకి సంబంధించిన లొకేష‌న్ల వేట కొన‌సాగుతుందట. సూర్య‌లో ఈ స్పీడ్ చూసి మిగతా హీరోలంతా షాక్ అవుతున్నారు. సాధార‌ణంగా కంగువా లాంటి వార్ సినిమా చేసిన త‌ర్వాత వెంట‌నే మ‌రో సినిమా షూటింగ్ లో పాల్గొన‌డం అంటే మామూలు విషయం కాదు. అప్ప‌టికే బాగా అలిసిపోయి ఉంటారు. వార్ స‌న్నివేశాల్లో న‌టించి ఒళ్లు ఓ రేంజ్ లో హూనమై ఉంటుంది.

Read Also:Ponnam Prabhakar : కేంద్ర మంత్రితో కలిసి దాండియా వీక్షించిన రాష్ట్ర మంత్రి పొన్నం

ఆ సినిమా తర్వాత క‌నీసం ఆరు నెల‌లైనా విశ్రాంతి తీసుకోవాల‌ని మిగత హీరోలు భావిస్తుంటారు. కొన్ని రోజుల పాటు విదేశాల‌కు వెకేష‌న్ కి వెళ్లిపోతుంటారు. కానీ సూర్య మాత్రం నో వెకేష‌న్ అంటూ అదే స్పీడు కొనసాగిస్తున్నాడు. 43 త‌ర్వాత‌…44..దీని త‌ర్వాత 45 అంటూ ఇప్పుడు మ‌రో సినిమా షూటింగ్ కు రెడీ అవుతున్నాడు. కంగువ న‌వంబ‌ర్ లో రిలీజ్ అయితే? 44వ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఆ వెంటనే వేసవికి మ‌రో రిలీజ్ ను ప్లాన్ చేసుకుంటారు. ఆ ర‌కంగా కొత్త ఏడాది లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలో సూర్య ప్రేక్షకుల ముందుకొచ్చే అవ‌కాశం ఉంది. సూర్య ప‌నిచేసిన దర్శకులంతా మంచి స‌క్సెస్ రేట్ ఉన్న వారే. 45వ సినిమా పూర్తియ‌న త‌ర్వాత వెట్రీ మార‌న్ తో 46వ చిత్రం ఉంటుంది. అదే ఏడాది బాలీవుడ్ చిత్రం క‌రణ్ సినిమాను కూడా సెట్స్ కి తీసుకెళ్తారు. ఈ చిత్రాన్ని రూ.500 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Show comments