NTV Telugu Site icon

Bribe: రూ.75 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ ట్రాప్‌కు చిక్కిన సర్వేయర్

Bribe

Bribe

Bribe: ఏసీబీకి ఓ అవినీతి చేప చిక్కింది. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండల సర్వేయర్ చిక్కాల ధర్మారావు ఏసీబీ ట్రాప్‌కు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ఎం.కిషోర్‌కుమార్ ఆధ్వర్యంలో అవినీతి నిరోధక శాఖకు చెందిన బృందం దాడి చేసింది. ఎలకొలను గ్రామానికి చెందిన బి.రాముడు నుంచి లంచం డిమాండ్ చేశాడు సర్వేయర్ చిక్కాల ధర్మారావు. ఈ క్రమంలో ఆ వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఓ పథకాన్ని రచించారు. రంగంపేట మండల సర్వేయర్ చిక్కాల ధర్మా రావు రూ. 75 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టుకున్న బృందంలో ఇన్‌స్పెక్టర్ ఎన్‌వీ భాస్కర్ రావు, డి.వాసుకృష్ణ, వై సతీష్, ఇతర సిబ్బంది ఉన్నారు.

Read Also: US: ప్రాణం తీసిన ఆర్గానిక్ క్యారెట్స్.. 50మంది ఆస్పత్రి పాలు.. అమ్మకాలు నిలిపివేత

Show comments