Fish Filtering plastic: ప్రస్తుతం దైనందిన జీవితంలో ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోయింది. నిజానికి ప్లాస్టిక్ వల్ల మానవాళికి హాని ఉంది. అది వేల సంవత్సరాల పాటు భూమిలో కలిసిపోకుండా కాలుష్యానికి దారి తీస్తుందని అందరికీ తెలుసు. ప్రభుత్వాలు ప్లాస్టిక్ వాడొద్దంటూ నెత్తీనోరు కొట్టుకుని ప్రచారం చేస్తున్నా విచ్చలవిడిగా ప్లాస్టిక్ వాడేస్తున్నారు. సముద్రాలు, నదులలో ప్లాస్టిక్ ఎక్కువగా పారేయడం వల్ల అందులోని జీవాలు మృత్యువాత పడుతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎప్పటినుంచో పరిష్కారాలను శాస్త్రవేత్తలు తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ప్లాస్టిక్‌ని నీటి నుంచి సులభంగా ఫిల్టర్ చేసే ఓ రోబో చేపను డెవలప్ చేశారు. సాధారణంగా పెద్ద సైజులో ఉన్న ప్లాస్టిక్ ని తీసి వేయడం సాధ్యమవుతుంది కానీ మిల్లీమీటర్ల సైజులో ఉండే వాటిని ఏరి వేయడం చాలా కష్టం. అయితే వీటిని కూడా సేకరించే ఒక రోబో చేపను ఒక యూనివర్సిటీకి చెందిన విద్యార్థి రూపొందించారు.
Read Also: Flash Light Eye: ఫ్లాష్ లైట్‌గా మారిన కన్ను.. కళ్లు చెదిరే ఆవిష్కరణ అంటే ఇదే కావొచ్చు
వివరాల్లోకి వెళితే. ఇంగ్లాండ్‌లోని సర్రే యూనివర్సిటీకి చెందిన కెమిస్ట్రీ స్టూడెంట్ ఎలియనోర్ మాకింతోష్ త్రీడీ గిల్బర్ట్ రోబో చేపను అభివృద్ధి చేశారు.ఈ ఆవిష్కరణ నేచురల్ రోబోటిక్స్ కాంటెస్ట్‌లో గెలుపొందడం విశేషం. నదులు, సముద్రాల్లోని ప్లాస్టిక్‌ను ఈ రోబో చేప సేకరించి అన్ని జీవులను కాపాడుతుందని ఒక పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ రోబో గిల్బర్ట్ చేప తన తోక సాయంతో ముందుకు వెళ్తుంది. అది తిరిగిన ప్రతి నీటి భాగంలో ప్లాస్టిక్‌ను సేకరిస్తుంది.ప్లాస్టిక్‌ను సేకరించే సమయంలో దీన్ని నోరు తెరుచుకుని ఉంటుంది.
Read Also: Rishi Sunak : ఫస్ట్ డేనే పార్లమెంట్లో రిషి సునాక్‌కు షాక్
దాని నోటిలోకి కొన్ని నీళ్లు వెళ్లిన తర్వాత ఆ రోబో చేప గిల్‌పాప్‌కి ఉన్న మెష్ ద్వారా ప్లాస్టిక్ సేకరించి మిగతా నీటిని బయటికి పంపిస్తుంది.ఈ చేప పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే నీటిలోని మైక్రో ప్లాస్టిక్ తొలగించడం చాలా వరకు సాధ్యమవుతుంది.దీని గురించి తెలుసుకున్న యానిమల్స్ లవర్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ చేప ఎంత త్వరగా అందరికీ అందుబాటులోకి వస్తే అంత మంచిది అని కామెంట్ చేస్తున్నారు.