Site icon NTV Telugu

Suriya-46 : సూర్య అభిమానులకు గుడ్ న్యూస్..

Surya 46

Surya 46

కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ కింగ్, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఎప్పుడూ అలరించే స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుసబెట్టి ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ స్పీడులో సూర్య తన 46వ సినిమా (వర్కింగ్ టైటిల్: సూర్య 46)ను తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో చేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో సూర్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను మేకర్స్ ఒక పక్కా ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. వెంకీ అట్లూరి గత సినిమాల ట్రాక్ రికార్డ్ చూస్తే, ఈసారి కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉంటాయని అర్థమవుతోంది. షూటింగ్ పూర్తవడంతో, త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టేందుకు టీమ్ రెడీ అవుతోంది.

Also Read : Salman Khan : ఒంటరితనమే మిగిలింది..

ఈ సినిమాతో దర్శకుడు వెంకీ అట్లూరి తన సక్సెస్ ట్రాక్‌ని కంటిన్యూ చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడట. ముఖ్యంగా, తెలుగు ఆడియన్స్‌కు సుపరిచితమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌ను సూర్య మార్కెట్‌కి తగ్గట్టుగా బ్యాలెన్స్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో మలయాళీ ముద్దుగుమ్మ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరి జోడీ చూడటానికి చాలా ఫ్రెష్‌గా ఉంటుందని టాక్. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌తో పాటు మిగతా కీలక అప్‌డేట్స్ అన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.

Exit mobile version