Supreme Court: గొడవలు జరిగితే భర్త ఉద్యాగాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సుప్రీంకోర్టు ఆందోళన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: వైవాహిక విభేదాలు వచ్చినప్పుడు భర్త పనిచేసే సంస్థకు ఫిర్యాదు భార్య ఫిర్యాదు చేయడం, ఉద్యోగం ఊడేలా ప్రయత్నించడం ఎంత వరకు కరెక్ట్? దానివల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. భార్యాభర్తల గొడవల సమయంలో చాలామంది మహిళలు భర్త యాజమాన్యానికి ఉత్తరాలు రాస్తున్నారని, ఇది చాలా తప్పుడు పద్ధతి అని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఓ కేసుకు సంబంధించిన బదిలీ పిటిషన్‌ను విచారిస్తున్నప్పుడు ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. విడాకులు కోరడం వేరని, కానీ భాగస్వామి ఉపాధిని దెబ్బతీయడం అత్యంత దారుణమైన విషయమని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. భర్త ఉద్యోగం పోతే, ఆ తర్వాత ఆమెకు అందాల్సిన పోషణ ఖర్చుల (మెయింటెనెన్స్) దావాకు కూడా ఎలాంటి ఆధారం లేకుండా పోతుందని హెచ్చరించారు.
ఈ విచారణ వెనుక ఓ పెద్ద వివాదమే ఉంది. గజియాబాద్‌కు చెందిన ఓ మహిళ, తనపై అస్సాంలో నమోదైన పరువు నష్టం కేసును గజియాబాద్‌కు మార్చాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే గజియాబాద్‌లో భర్తపై అనేక కేసులు నడుస్తున్నాయని కోర్టుకు తెలిపింది. అయితే ఈ పరువు నష్టం కేసు నేరుగా భర్త వేసింది కాదు. ఎయిర్ ఫోర్స్ అధికారి అయిన తన భర్త, సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా సొంత వ్యాపారం నడుపుతున్నాడంటూ సదరు మహిళ ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె భర్త స్నేహితుడు, సహోద్యోగి ఈ పరువు నష్టం దావా వేశారు.
Also Read
- Dulquer Salmaan: వరుస తెలుగు సినిమాలతో రచ్చకు రెడీ అవుతున్న మాలీవుడ్ స్టార్ కిడ్..!
- Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
- Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
- Deepika Padukone: ప్రెగ్నెంట్ అయితే రెస్ట్ తీసుకోవాలా.. మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్.?
ఈ ఫిర్యాదు వెనుక తన వద్ద బలమైన కారణం ఉందంటూ మహిళ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. భర్తే ముందుగా తమపై ఎయిర్ ఫోర్స్ హెల్మెట్ దొంగిలించారంటూ అసత్య ఫిర్యాదు చేశారని కోర్టుకు తెలిపారు. ఆ వస్తువు ఎక్కడుందో తెలుసుకోవడానికే తాను ఎయిర్ ఫోర్స్ అధికారులకు వినతిపత్రం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ వాదనలు విన్న న్యాయస్థానం, ఈ వ్యవహారాన్ని పరిష్కారం కోసం సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ కేంద్రానికి (మీడియేషన్ సెంటర్) పంపింది. అంతేకాకుండా, గొడవలన్నీ సర్దుమనుచుకుని మోపిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని సదరు మహిళకు సలహా ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాదికి జస్టిస్ నాగరత్న సూచించారు.
తాజావార్తలు
-
Dulquer Salmaan: వరుస తెలుగు సినిమాలతో రచ్చకు రెడీ అవుతున్న మాలీవుడ్ స్టార్ కిడ్..!
-
Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
-
Passport New Rules 2026: పాస్‌పోర్ట్ నిబంధనలు, ఫీజుల్లో మార్పులు.. కొత్త ఛార్జీలు ఇవే
-
Biggest Flop Movies : ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ నష్టాలు తెచ్చిన టాప్ సినిమాలు ఇవే..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
ట్రెండింగ్
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!