Site icon NTV Telugu

Supreme Court: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు.. రేపే సుప్రీంకోర్టు కీలక తీర్పు..!

Supreme Court

Supreme Court

Supreme Court: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో గురువారం దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించనుంది.. తమ పార్టీలో గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని వాళ్లను అనర్హులుగా ప్రకటించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్.. పార్టీ ఫిరాయించిన వారిలో దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ బీఫామ్ పై సికింద్రాబాద్ పార్లమెంటుకు పోటీ చేశారని కోర్టులో వాదన వినిపించారు బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు.. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పులు రిజర్వ్ చేసింది.. ఫైనల్ గా పార్టీ ఫిరాయింపుల తీర్పును గురువారం వెల్లడించనుంది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం..

READ MORE: Annadata Sukhibhava: రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ పథకంకు ముహూర్తం ఖరారు!

సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో ఇరువైపులా వాదనలు గతంలోనే ముగిసాయి.. సుప్రీంకోర్టులో అసెంబ్లీ స్పీకర్ తరఫున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గి వాదన వినిపించారు.. అసెంబ్లీ సెక్రటరీ తరఫున అభిషేక్ సింగ్వి వాదన వినిపించారు.. స్పీకర్ నిర్ణయానికి కాల పరిమితి విధించే విషయంలో ఎలాంటి తీర్పులు లేవని అభిషేక్ సింగ్వి కోర్టుకు తెలుపగా, స్పీకర్ కు రాజ్యాంగం కల్పించిన విశేషాలను కోర్టులు ప్రశ్నించడానికి వీల్లేదని, ఒకసారి స్పీకర్ నిర్ణయం తీసుకున్నాకే జ్యూడిషియల్ సమీక్ష చేయొచ్చని స్పీకర్ తరఫున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గి వాదన వినిపించారు.. అంతేకాదు ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయకూడదంటూ వాదనలు వినిపించారు.. రీజనబుల్ టైమ్ అంటే ఏంటి? నాలుగేళ్లు గడిచినా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే చూస్తూ ఉండాలా..? అంటూ జస్టిస్ బీఆర్ గవాయి గత విచారణ సందర్భంగా స్పీకర్ తరపు న్యాయవాదులను ప్రశ్నించారు..

READ MORE: AP Crime News: కోనసీమ జిల్లాలో దారుణం.. 10వ తరగతి విద్యార్థిని గర్భవతి! కరస్పాండెంట్‌పై పోక్సో కేసు

మరోపక్క అసెంబ్లీలో ఉప ఎన్నికలు రావంటూ ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ ను కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు బీఆర్ఎస్ తరపు న్యాయవాది. దాంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.. గతంలోనూ సుప్రీంకోర్టు తీర్పులపై ముఖ్యమంత్రి కామెంట్ చేశారని.. సీఎం సమయమనం పాటించాలి అంటూ జస్టిస్ బి.ఆర్.గవాయి సీరియస్ అయ్యారు.. మొత్తానికి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుంది అనేది ఇప్పుడు సర్వత్ర ఉత్కంఠ రేపుతుంది.

Exit mobile version