Supreme Court: ఆర్మీ తీరుపై సుప్రీం కోర్టు ఫైర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ఇండియన్ ఆర్మీ తీరుపై సోమవారం దేశ సర్వోన్నత న్యాయ స్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత సైన్యంలోని జడ్జి అడ్వొకేట్ జనరల్ (లీగల్) బ్రాంచి పోస్టుల్లో నియామకాల కోసం అనుసరిస్తున్న 2:1 రిజర్వేషన్ నిష్పత్తి విధానం సరికాదని, దాన్ని అమలు చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మహిళలపై పరిమితి పెట్టి ఖాళీ పోస్టులను పురుషులకు రిజర్వ్ చేయకూడదని తేల్చిచెప్పింది. లింగ తటస్థతకు నిజమైన అర్ధం.. స్త్రీ, పురుష భేదం లేకుండా అత్యంత ప్రతిభావంతులైన అభ్యర్థులను ఎంపిక చేయడమేనని పేర్కొంది.
READ MORE: Tollywood : ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రితో ముగిసిన నిర్మాతలు భేటీ.. నంది అవార్డ్స్ పై కీలక ప్రకటన
Also Read
- POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
- 1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
ఇకపై సమానత్వ పద్ధతిలోనే నియామకాలు చేపట్టాలి..
సైన్యంలోని జడ్జి అడ్వొకేట్ జనరల్ లీగల్ పోస్టుల కోసం జరిగిన పరీక్షల్లో అష్నూర్ కౌర్, ఆస్థ త్యాగీ అనే మహిళా అధికారులు వరుసగా 4, 5వ ర్యాంకులు సాధించారు. వీరికి మెరిట్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. మహిళల కోటాల్లో ఖాళీలు లేవంటూ విధుల్లోకి తీసుకోలేదు. ఈక్రమంలో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం వీరి పిటిషన్‌పై గతంలో విచారణ జరిపి అప్పుడు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా సుప్రీం ధర్మాసనం ఈ అంశంపై తీర్పు వెలువరించిన.. లింగ తటస్థతకు నిజమైన అర్ధం.. స్త్రీ, పురుష భేదం లేకుండా అత్యంత ప్రతిభావంతులైన అభ్యర్థులను ఎంపిక చేయడమేనని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఆర్మీ ఉన్నతాధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. సైన్యంలోని జడ్జి అడ్వొకేట్ జనరల్ లీగల్ పోస్టుల విభాగంలో పురుషులకు 6.. మహిళలకు 3 పోస్టులు కేటాయించాలని నిష్పత్తి పెట్టడం ఏకపక్ష నిర్ణయంగా తెలిపింది. ఇలా మహిళలకు సీట్లను పరిమితం చేయడం సమానత్వ హక్కును ఉల్లంఘించడమే అవుతుంది. మహిళలపై పరిమితి పెట్టి.. ఖాళీ పోస్టులను పురుషులకు రిజర్వ్ చేయడం సమంజసం కాదని వెల్లడించింది. ఈ విధానాలను అనుసరిస్తే ఏ దేశం భద్రంగా ఉండబోదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఎంపిక ప్రక్రియలో భాగంగా స్త్రీ, పురుష అభ్యర్థుల మెరిట్ జాబితాను బహిర్గతం చేయాలని సూచించింది. ఇకపై సమానత్వ పద్ధతిలోనే నియామకాలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాము సైన్యంపై తమ సొంత అభిరుచులను విధించడం లేదని, రాజ్యాంగం, చట్టం ఆదేశాన్ని అమలు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
READ MORE: MLA Rajagopal Reddy: డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో ట్వీట్!
తాజావార్తలు
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!