Supreme Court: శరద్ పవార్ పేరు, ఫొటోపై ఎన్సీపీకి కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల వేళ అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఎన్నికల ప్రచారంలో శరద్ పవార్ ఫొటో, పేరు ఉపయోగించొద్దని ఎన్సీపీకి న్యాయస్థానం ఆదేశించింది.
ఎన్నికల ప్రచారంలో శరద్ పవార్ పేరు, ఫొటో ఉపయోగించవద్దని అజిత్ పవార్ వర్గానికి సుప్రీంకోర్టు తాజాగా సూచించింది. ఈ మేరకు హామీ ఇవ్వాలని కోరింది. లేనిపక్షంలో అజిత్ వర్గానికి వ్యతిరేకంగా ఆదేశాలు ఇస్తామని హెచ్చరించింది. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో తన పేరు, ఫొటోను అజిత్ వర్గం ఉపయోగించకుండా ఆదేశాలివ్వాలని శరద్ పవార్ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది.
Also Read
- IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
- China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
- Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్‌పై ఫోకస్
ప్రజాదరణపై నమ్మకం ఉన్నప్పుడు సొంత ఫొటోనే ఉపయోగించాలని అజిత్ పవర్‌కు కోర్టు సూచించింది. ఇకపై శరద్ పవార్ ఫొటో ఉపయోగించొద్దని మీ కార్యకర్తలకు చెప్పాలని ఆదేశించింది. ఆ పని చేయలేకపోతే.. మేం ఆదేశాలు ఇస్తామని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై మార్చి 19లోగా స్పందన తెలియజేయాలని అజిత్ పవార్ వర్గానికి ఆదేశించింది.
అజిత్ పవార్ గతేడాది ఎన్సీపీ నుంచి విడిపోయి బీజేపీ-షిండే సారథ్యంలోని ప్రభుత్వంలో చేరడంతో ఆ పార్టీలో సంక్షోభం తలెత్తింది. దీంతో పార్టీ ఎవరిదనే విషయంలో ఇరు వర్గాల మధ్య నెలకొన్న వివాదాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల పరిష్కరించింది. అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తించింది. ఆ పార్టీ జెండా, ఎన్నికల గుర్తును కూడా వారికే కేటాయించింది. ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అజిత్ వర్గం చీలిక తర్వాత శరద్ పవార్ పార్టీపై క్రమంగా నియంత్రణ కోల్పోయారు. ప్రస్తుతం శరద్ పవార్ వెంట 12 మంది ఎమ్మెల్యేలే ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే శరద్ పవార్ కూడా కొత్త పార్టీ స్థాపించారు. వచ్చే ఎన్నికల్లో కొత్త పార్టీ నుంచే పోటీ చేయనున్నారు.
తాజావార్తలు
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
-
China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
-
Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?