NTV Telugu Site icon

Srisailam: శ్రీశైలంలో అన్య మతస్థులకు షాపులపై సుప్రీంకోర్టు తీర్పు..

Srisailam

Srisailam

శ్రీశైలంలో అన్య మతస్థులకు షాపులు కేటాయించ వద్దన్న జీవో నెంబర్ 425పై స్టే కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శ్రీశైలం దేవస్థానం ప్రాంతంలో అన్య మతస్థులకు దుకాణాలు కేటాయించ వద్దని 2015లో ప్రభుత్వం జీవో 425 జారీ చేసిన విషయం తెలిసిందే. జీవో 425 ను సవాల్ చేస్తూ పలువురు దుకాణదారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు 2020లో జీవోపై స్టే విధించింది. స్టే విధించినప్పటికీ ప్రభుత్వం మళ్లీ టెండర్లను పిలిచింది. దాంతో పలువురు దుకాణదారులు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

READ MORE: Rajamouli – Rashmi: రష్మితో రాజమౌళి ఫ్లర్టింగ్.. వీడియో చూశారా?

దుకాణాల వేలం టెండర్లను పొరపాటున జారీ చేశామని, ప్రస్తుతం వాటిని ఉపసంహరించుకున్నామని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ అంశంపై స్థానిక అధికారులకు అయోమయం లేకుండా తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఒకా, జస్టిస్ ఉజ్జన్ భూయల్ ధర్మసనం.. జీవో 425 అమలు చేయొద్దని మరోసారి స్పష్టంగా వెల్లడించింది.

READ MORE: CM Chandrababu: కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ.. మిర్చి రైతులను ఆదుకోండి..

శ్రీశైలంలో అన్యమతస్తులకు షాపులు కేటాయించడంపై హిందూ ధార్మిక సంస్థలు గతంలో తీవ్ర అభ్యంతరం తెలిపాయి. అలాగే తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఈ సంఘటనపై స్పందిస్తూ వెంటనే అన్యమతస్తుల షాపులు తొలగించాలని డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమాలు సైతం నిర్వహించారు. ఇక్కడి దుకాణాల వేలం పాటలో ఇతర మతస్థులు పాల్గొననవద్దని బీజేపీతో సహా ఇతర పార్టీలు వేలంను అడ్డుకున్నాయి. దీంతో అప్పుడు వేలం పాటను నిలిపివేశారు. అయితే వివాదం రాజుకున్న తరువాత ఆలయ ఈవోను బదిలీ చేశారు. అనంతరం అన్య మతస్థులకు దుఖానాలు షాపులు కేటాయించ వద్దని ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. ఈ జీవోపై సుప్రీంకోర్టు రెండు సార్లు స్టే విధించింది.