Site icon NTV Telugu

Supreme Court : అమరావతిపై సుప్రీంకోర్టులో విచారణ మళ్లీ వాయిదా

Supreme Court

Supreme Court

జస్టిస్ కె.ఎం. జోసెఫ్ మరియు జస్టిస్ B.V. నాగరత్న కూడిన సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ప్రతిపాదిత మూడు రాజధానులు మరియు అనుసంధాన విషయాలపై హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) తదుపరి విచారణను ఫిబ్రవరి 23కి పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. దీనిని అత్యవసరంగా విచారించాల్సి ఉందని రాష్ట్రం తరపున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టుకు తెలిపారు. ప్రతివాదుల (అమరావతి రైతులు) తరపు న్యాయవాదులు దీనికి సంబంధించి కోర్టు అందించిన నోటీసులు గత నెల చివరిలో తమకు అందాయని, కౌంటర్లు దాఖలు చేయడానికి రెండు వారాలు అవసరమని బదులిచ్చారు.

Also Read : Bandi Sanjay: ప్రజలకు ఏ సమస్య వచ్చిన బీజేపీ అండగా ఉంటుంది

ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కేసును ఫిబ్రవరి 23కి వాయిదా వేసింది. అయితే ఈ నేపథ్యంలో.. నేడు విచారణ జరగాల్సిన జాబితాలో ఏపీ రాజధానికి సంబంధించిన కేసు లేకపోవడంతో విచారణ మళ్లీ వాయిదా పడింది. అయితే.. తిరిగి ఎప్పుడు దీనిపై విచారణ చేపడుతారో తెలియరాలేదు. అయితే.. ఇవాళ్టి విచారణ ఎందుకు వాయిదా పడిందనేది ఇంకా స్పష్టత రాలేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వర్సెస్ మూడు రాజధానుల అంశంపై త్వరలో సుప్రీంకోర్టు నుంచి క్లియరెన్స్ వస్తుందని ఏపీ ప్రభుత్వం ఆశపడుతోంది. అయితే.. అందుకు తగ్గట్టుగానే ఇటీవల కొద్దిరోజులుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా మంత్రులు విశాఖ నుంచి పరిపాలన చేపట్టనున్నామంటూ ప్రకటనలు ఇస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇన్వెస్టర్లతో జరిగిన వివిధ సమావేశాల్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఈ అశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉండగా.. అనూహ్యంగా విచారణ మళ్లీ వాయిదా పడింది

Also Read : Taraka Ratna: నా జీవితంలో నువ్వే బెస్ట్… తారకరత్న గురించి అలేఖ్య ఎమోషనల్ పోస్ట్

Exit mobile version