Site icon NTV Telugu

Supreme Court: మహిళలపై వివక్ష లేకుండా ఆ పదాలకు సుప్రీం చెక్‌.. కొత్త హ్యాండ్‌బుక్ విడుదల

Supreme Court

Supreme Court

Supreme Court: కోర్టుల్లో విచారణ, తీర్పుల సందర్భంలో లింగ వివక్షకు తావు లేకుండా పదాలను వినియోగించడంపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉండే మూస పదజాలానికి సర్వోన్నత న్యాయస్థానం స్వస్తి పలికింది. ఈ మేరకు వైశ్య, పతిత, విధేయత గల భార్య వంటి దాదాపు 40 పదాలను తొలగిస్తూ కొత్త హ్యాండ్ బుక్‌ను విడుదల చేసింది. మహిళలకు సంబంధించిన తీర్పుల్లో ఇకపై న్యాయమూర్తులు సున్నితమైన పదజాలాన్ని వినియోగించనున్నారు. ఇది కోర్టు ఆదేశాలలో అనుచితమైన లింగ నిబంధనలను ఉపయోగించకుండా న్యాయమూర్తులకు సహాయపడుతుంది.

Read Also: Pakistan: దైవదూషణ ఆరోపణలు.. పాకిస్థాన్‌లో చర్చిలు ధ్వంసం

విచారణ సందర్భంలో మహిళల ప్రస్తావనలో వాడాల్సిన పదాలు, వాక్యాలకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ ఓ హ్యాండ్‌బుక్‌ను విడుదల చేశారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ.. “ఇది న్యాయపరమైన చర్చలో మహిళలకు సంబంధించిన మూస పద్ధతులకు సంబంధించినది. ఇది న్యాయస్థానాలు ఉపయోగించే మూస పద్ధతులను గుర్తిస్తుంది. అవి తెలియకుండా ఎలా ఉపయోగించబడుతున్నాయి. ఇది తీర్పులపై ఆశలు పెట్టుకోవడం కాదు. ఇది న్యాయమూర్తులకు సహాయం చేస్తుంది. మూస పద్ధతులకు దారితీసే భాషను గుర్తించడం ద్వారా దానిని నివారించడం. అదే హైలైట్ చేసిన బైండింగ్ నిర్ణయాలను ఇది హైలైట్ చేస్తుంది.” అని ఆయన తెలిపారు.

Read Also: Ghost : 16 సార్లు కత్తితో పొడిచిన బాయ్ ఫ్రెండ్.. వచ్చి కాపాడిన దెయ్యం.. ఇంట్రెస్టింగ్ స్టోరీ

‘తీర్పుల్లో విషయాన్ని తెలపడానికి న్యాయమూర్తులు మహిళల పట్ల వాడే కొన్ని పదాలు లింగ వివక్షకు దారితీస్తున్నాయి. ఇది వ్యక్తి గౌరవానికి భంగం కలిగిస్తున్నాయి. కేసుల్లో సరైన తీర్పు వెల్లడించినప్పటికీ మూస పదాల కారణంగా ఓ వర్గానికి తెలియకుండానే అన్యాయం జరుగుతోంది’ అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. “స్టీరియోటైప్‌లు ఇతర వ్యక్తుల పట్ల మన ఆలోచనలు, చర్యలను ప్రభావితం చేస్తాయి. అవి మన ముందు ఉన్న వ్యక్తిని వారి సొంత లక్షణాలతో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూడకుండా నిరోధిస్తాయి. వారి గురించి సరికాని అంచనాలు చేయడానికి దారితీస్తాయి. మూస పద్ధతులు పరిస్థితి వాస్తవికతను అర్థం చేసుకోకుండా నిరోధించగలవు.” అని హ్యాండ్‌బుక్ చెబుతోంది.

Exit mobile version