Supreme Court: “సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి”.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: కర్ణాటకలోని శృంగేరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 2023 ఎన్నికల కౌంటింగ్ వీడియో రికార్డింగ్ మాయమవ్వడంపై సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి గట్టిగా మొట్టికాయలు వేసింది. తాము నిర్వహించిన ఎన్నికల తాలూకు అధికారిక రికార్డులే గల్లంతయ్యాయని ఈసీ ఎలా చెబుతుందని జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవాలతో కూడిన ధర్మాసనం తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణలోగా అందుబాటులో ఉన్న రికార్డులన్నింటిని కోర్టు ముందుంచాలని, లేనిపక్షంలో ఈసీకి వ్యతిరేకంగా చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఎన్నికలు నిర్వహించడమే మీ ప్రధాన విధి అయినప్పుడు, దానికి సంబంధించిన పత్రాలు మీ వద్ద లేవనడం ఏంటని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఎన్నికల సంఘం ఇలాంటి బలహీనమైన సాకులు చెప్పడాన్ని తాము అస్సలు అంగీకరించబోమని స్పష్టం చేసింది.
ఈ వివాదం వెనుక అసలు కథ ఏమిటంటే..?
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో శృంగేరి స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి టి.డి. రాజేగౌడ కేవలం 201 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించినట్లు ప్రకటించారు. దీనిపై బీజేపీ అభ్యర్థి డి.ఎన్. జీవరాజ్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు.. పోస్టల్ బ్యాలెట్ల రీకౌంటింగ్‌కు ఆదేశించడంతో, 2026 మే 3న వెలువడిన సవరించిన ఫలితాల్లో రాజేగౌడ ఓట్లు తగ్గిపోయి, జీవరాజ్ విజయం సాధించినట్లు తేలింది.
Also Read
- Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
- Ind vs WI: తేలిపోయిన భారత బౌలర్లు.. భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం..
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
దీంతో రాజేగౌడ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆయనకు ఊరట లభించింది. ప్రస్తుతానికి ఆయన ఎమ్మెల్యేగా కొనసాగేందుకు కోర్టు అనుమతించింది. హైకోర్టు కేవలం 279 తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్లను మాత్రమే మళ్లీ పరిశీలించమని చెప్పినా, రిటర్నింగ్ అధికారి తన అధికార పరిధిని దాటి ఏకంగా 562 చెల్లుబాటు అయ్యే బ్యాలెట్లను కూడా రీఎవాల్యుయేషన్ చేశారని రాజేగౌడ తరఫు వాదన. అయితే.. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పారదర్శకతను నిరూపించేందుకు పరిశీలకుడి (అబ్జర్వర్) నివేదికతో పాటు, 2023 నాటి ఒరిజినల్ కౌంటింగ్, రీకౌంటింగ్‌కు సంబంధించిన వీడియో రికార్డింగ్‌ను ఇవ్వాలని రాజేగౌడ కోరారు. అయితే ఈ వీడియో ఫుటేజ్‌ను సమర్పించడంలో ఎన్నికల సంఘం విఫలమైంది. 2023 నాటి అసలు కౌంటింగ్ వీడియో కనిపించడం లేదని, దాని కోసం వెతుకుతున్నామని ఈసీ తరఫు సీనియర్ అడ్వకేట్ శేషాద్రి నాయుడు కోర్టుకు తెలపగా.. ధర్మాసనం ఆ వాదనను పూర్తిగా తోసిపుచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు 2027 ఫిబ్రవరి 15కి వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Supreme Court: “సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి”.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
-
Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
-
Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
-
Ind vs WI: తేలిపోయిన భారత బౌలర్లు.. భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం..
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..