NTV Telugu Site icon

Supreme Court: ఫైబర్‌ నెట్‌ కేసు.. నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ

Chandrababu

Chandrababu

Supreme Court: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారు.. నవంబర్‌ 1వ తేదీ వరకు చంద్రబాబు నాయుడు రిమాండ్‌ను విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం పొడిగించిన విషయం విదితమే.. మరోవైపు.. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్ కేసు, ఫైబర్‌ నెట్‌ కేసు.. ఇలా చంద్రబాబుపై రకరకాల అభియోగాలు నమోదు అయ్యాయి.. అయితే, ఈ రోజు సుప్రీం కోర్టులో ఫైబర్ నెట్ కేసుపై విచారణ జరగనుంది.. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు.. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా. ఎమ్. త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు వినిపించనున్నారు.. 9వ నెంబర్ గా చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ లిస్ట్‌ అయ్యింది.. అయితే, ఫైబర్ నెట్ కేసులో హైకోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు నాయుడు. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్‌కు హైకోర్టు నిరాకరించడంతో.. దానిని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు చంద్రబాబు నాయుడు.

Read Also: Urvashi Rautela: ఊర్వశికి షాక్.. ఫోన్ కొట్టేసిన వ్యక్తి కండీషన్ ఏంటో తెలుసా..?

కాగా, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వెకేషన్‌ బెంచ్‌కు హైకోర్టు బదిలీ చేసిన విషయం విదితమే.. స్కిల్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ విచారణను వాయిదా వేసిన హైకోర్టు.. దసరా సెలవుల తర్వాతే విచారిస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో బెయిల్‌ పిటిషిన్‌పై విచారణను వెకేషన్‌ బెంచ్‌కు బదిలీ చేయాలని చంద్రబాబు తరఫు లాయర్లు విజ్ఞప్తి చేశారు.. చంద్రబాబు లాయర్ల అభ్యర్థనకు అంగీకరించింది హైకోర్టు.. ఈ క్రమంలో బెయిల్‌ పిటిషన్‌పై విచారణను దసరా సెలవుల్లో హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ చేపట్టనుంది.