Supreme Court: పౌరసత్వ సవరణ చట్టం (CAA)పై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్లను కోర్టు మార్చి 19న విచారించనుంది. CAA కోసం కేంద్ర ప్రభుత్వం నిబంధనలను జారీ చేసిన ఒక రోజు తర్వాత, కేరళకు చెందిన రాజకీయ పార్టీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) నిబంధనల అమలుపై స్టే విధించాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానాని ఆశ్రయించింది. ఈ చట్టాన్ని నిషేధించాలని, ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని కేరళకు చెందిన రాజకీయ పార్టీ డిమాండ్ చేసింది. IUMLతో పాటు డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DYFI), అస్సాం అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు దేబబ్రత సైకాతో పాటు అస్సాం నుంచి కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖలీక్ తో పాటు ఇతరులు కూడా నిబంధనలపై స్టే కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు.
Read Also: Rohit Sharma-IPL 2024: బాధ్యతలు లేవు.. ఐపీఎల్ 2024లో రోహిత్ శర్మ రెచ్చిపోతాడా?
ఇక, ఈ చట్టం ఏకపక్షంగా ఉందని తెలిపారు. కేవలం వారి మతపరమైన గుర్తింపు ఆధారంగా ఒక వర్గానికి అనుకూలంగా అన్యాయమైన ప్రయోజనాన్ని కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 లేదా 15 ప్రకారం అనుమతించబడదని పిటిషన్ పేర్కొంది. మతం ప్రాతిపదికన CAA వివక్ష చూపుతున్నందున.. రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం అయిన లౌకికవాదం యొక్క మూలంపై దాడి చేస్తోందని పిల్ లో తెలిపింది. ఇక, CAAని 11 డిసెంబర్ 2019న పార్లమెంట్ ఆమోదించింది.. మరుసటి రోజు రాష్ట్రపతి ఆమోదం పొందింది.. సీఏఏ 10 జనవరి 2020 నుంచి అమలులోకి వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ తో పాటు పాకిస్తాన్‌లలో మతపరమైన హింస నుంచి పారిపోయి డిసెంబర్ 31, 2014 లేదా అంతకు ముందు భారతదేశంలో ఆశ్రయం పొందిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు పౌరసత్వం ఇవ్వాలని ఈ చట్టంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించింది.