NTV Telugu Site icon

Hijab: “ఏ దుస్తులు వేసుకోవాలో మీరెలా నిర్ణయిస్తారు”.. హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..

Supremecourt

Supremecourt

హిజాబ్, బురఖా, నిఖాబ్ ధరించడంపై నిషేధం ఉన్న ముంబైలోని ఓ ప్రైవేట్ కాలేజీ సూచనలను సుప్రీంకోర్టు పాక్షికంగా స్టే విధించింది. ఎన్‌జీ ఆచార్య అండ్ డీకే మరాఠే కాలేజీని నిర్వహిస్తున్న ‘చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీ’కి నవంబర్ 18లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. క్యాంపస్‌లో హిజాబ్, బురఖాలకు వ్యతిరేకంగా ముంబయిలోని ఎన్‌జీ ఆచార్య అండ్‌ డీకే మరాఠీ కాలేజీ ఇటీవల సర్క్యులర్‌ను జారీచేసిన సంగతి తెలిసిందే. కాలేజీ ఆదేశాలను సవాలు చేస్తూ ముస్లిం విద్యార్థులు బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు కళాశాలకు అనుకూలంగా తీర్పు చెప్పడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాలేజీ ఆదేశాలపై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.

READ MORE: Triple Murder In Bihar: ఒకే కుటుంబంలో ముగ్గురు హత్య.. విషమంగా ఒకరి పరిస్థితి..!

యాజమాన్యం తరఫు న్యాయవాది మాధవి దివాన్‌ తన వాదనలు వినిపించారు. విద్యార్థుల మతం బహిర్గతం చేయకూడదనే లక్ష్యంతో ఈ నిబంధన పెట్టినట్లు కోర్టుకు తెలిపారు. దీంతో ఒక్కసారిగా న్యాయమూర్తులు మండిపడ్డారు. విద్యార్థుల పేర్లలో మతం ప్రతిబింబించలేదా? పిల్లలను వారి రోల్ నంబర్లను బట్టి పిలుస్తారా?, మతాన్ని బహిర్గతం చేయొద్దనేది మీ ఉద్దేశమైతే విద్యార్థులు బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నారు? బొట్టు పెట్టుకోవడాన్ని ఎందుకు నిషేధించలేదు? ఇలాంటి నిబంధనలను అమలు చేయడం అంటే మతాన్ని బయటపెట్టడం కాదా? అని న్యాయస్థానం ప్రశ్నించింది.

READ MORE: Bandi Sanjay: 8 రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. మోడీ సంకల్పానికి సాక్ష్యం..

కాలేజీ ఎప్పటి నుంచి నడుస్తోంది అని జస్టిస్ ప్రశ్నించారు. 2008 నుంచి ఉనికిలో ఉందని మాధవి దేవాన్ బదులిచ్చారు. దీనిపై న్యాయమూర్తి మాట్లాడుతూ.. ‘ఇన్నేళ్లుగా మీరు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు.. మీకు హఠాత్తుగా ఎందుకు గుర్తుకు వచ్చింది? ఇన్నేళ్ల తర్వాత మీరు ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం విచారకరం. బొట్టుతో వచ్చే విద్యార్థులను అనుమతించబోమని చెప్పగలరా? అని నిలదీసింది. దీనిపై మాధవి దివాన్ మాట్లాడుతూ.. ‘441 మంది ముస్లిం విద్యార్థులు కళాశాలకు ఆనందంగా హాజరయ్యారు. ఈ నిబంధనలపై కొంతమంది విద్యార్థులు మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.” అని తెలిపారు. “అమ్మాయిలు ఏ దుస్తులు వేసుకోవాలో మీరెలా నిర్ణయిస్తారు.. అమ్మాయిలు ఏ రకమైన దుస్తులు వేసుకోవాలనుకుంటున్నారో వారికే వదిలేయాలి” అని కోర్టు వ్యాఖ్యానించింది.