Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఊరట.. తిరంగా మార్చ్‌పై తక్షణ ఆదేశాలకు నిరాకరణ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కానాట్ ప్లేస్‌లో “కాకరోచ్ జనతా పార్టీ” (సీజేపీ) తలపెట్టిన తిరంగా మార్చ్‌పై ఇమీడియట్గా ఎలాంటి ఆర్డర్స్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నో చెప్పింది. పండుగ సీజన్ కావడంతో ఈ ఆందోళనల వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటాయని కొందరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఇరు వర్గాలు కాస్త సంయమనం పాటిస్తాయని, మెరుగైన విచక్షణతో వ్యవహరిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపింది. పండుగ రద్దీ ఉండే ఈ సమయంలో నిరసనల వల్ల సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని కోర్టు స్పష్టం చేసింది. అయితే వ్యాపారుల ఆందోళనలపై తక్షణమే జోక్యం చేసుకుని ఎలాంటి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసేందుకు మాత్రం న్యాయస్థానం నిరాకరించింది.
మరోవైపు, ఈ మార్చ్ నేపథ్యంలో దిల్లీ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత కన్నాట్ ప్లేస్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రయాణించేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. మరోవైపు, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ప్రజలందరూ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు జాతీయ జెండాతో కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌కు చేరుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా సీజేపీ తలపెట్టిన ఈ ఆందోళనకు, ఢిల్లీ పోలీసులకు మధ్య కొంతకాలంగా ప్రతిష్టంభన కొనసాగుతోంది.
Also Read
ఈ పరిణామాల నేపథ్యంలో న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎండీఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. అపరిశుభ్రత లేదా ఇతర పరిపాలనా కారణాలను సాకుగా చూపుతూ, శుక్రవారం, శనివారాల్లో సెంట్రల్ పార్క్‌ను సాధారణ ప్రజల రాకపోకలకు పూర్తిగా మూసివేస్తున్నట్లు ఢిల్లీ పోలీస్ శాఖకు సమాచారం అందించింది. పార్క్‌లోకి అనధికారిక ప్రవేశాలను అడ్డుకోవడానికి తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని కూడా కోరింది. అంతకుముందు, సీజేపీని ఈ మార్చ్ నిర్వహించకుండా నిరోధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా, ప్రెస్మీట్ల ద్వారా సీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
ఈ నిరసన ప్రదర్శనలకు దూరంగా ఉండాలని ఢిల్లీ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిర్దిష్ట సంఖ్యలో వ్యక్తులు తగిన ప్రదేశంలో జాతీయ జెండా ఎగురవేసేందుకు, రాష్ట్రీయ గీతం పాడుకునేందుకు అనుమతించే వెసులుబాటును పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం, ప్రజల ప్రాణాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల రక్షణ నిమిత్తం భారతీయ నాగరిక సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఊరట.. తిరంగా మార్చ్‌పై తక్షణ ఆదేశాలకు నిరాకరణ!
-
TDP vs YCP: పుంగనూరులో ఉద్రిక్తత.. వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి!
-
Punam Raut Retires: “చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా”.. రిటైర్మెంట్ ప్రకటనపై పూనమ్ భావోద్వేగం..
-
Gujarat: పాకిస్థాన్‌కు చెందిన 319 మందికి భారత పౌరసత్వం.. శరణార్థుల కన్నీటి పర్యంతం..
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!