NTV Telugu Site icon

Supreme Court: డిప్యూటీ సీఎం పదవిని రద్దు చేయాలని పిటిషన్‌.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Supreme Court

Supreme Court

Deputy CM Post: డిప్యూటీ సీఎం పదవిని రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పదవి రాజ్యాంగంలో లేనప్పటికీ.. ఎలాంటి నిబంధనను ఉల్లంఘించలేదని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ విధంగా డిప్యూటీ సీఎం పదవిని రద్దు చేయాలంటూ దాఖలైన పిల్‌ను కోర్టు తోసిపుచ్చింది. రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం పదవి ప్రస్తావన లేకపోయినా.. న్యాయస్థానం, అయితే ఈ పదవిలో అధికార పార్టీ లేదా ఏ కూటమి పార్టీ నాయకుడిని నియమించడం చట్ట విరుద్ధం కాదని తెలిపింది.

Read Also: Indonesia Footballer: మైదానంలో పిడుగు.. మృతిచెందిన ఫుట్‌బాల‌ర్! వీడియో వైరల్

ఇక, డిప్యూటీ సీఎం అంటే ఎమ్మెల్యే, మంత్రి అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. అధికార పార్టీ నాయకుడైనా.. కూటమి పార్టీకైనా గౌరవం దక్కేలా ఆయన్ను డిప్యూటీ సీఎం అంటారు అని సుప్రీం కోర్టు తెలిపింది. చాలా రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రులను నియమించే సంప్రదాయం కొనసాగుతోంది.. దీన్ని బట్టి పార్టీలు తమ సీనియర్ నేతలకు కాస్త గౌరవం ఇస్తున్నాయి.. డిప్యూటీ సీఎం పదవి కూడా ఇతర మంత్రుల మాదిరిగానే కేబినెట్ సమావేశాల్లో పాల్గొంటారని, వారి అధినేత సీఎం అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

Read Also: Revanth vs Harish: అసెంబ్లీలో మాటకు మాట.. రేవంత్ vs హరీష్..

అయితే, చాలా రాష్ట్రాలు ఈ తప్పుడు సంప్రదాయాన్ని ప్రారంభించాయని పిటిషనర్ న్యాయవాది అన్నారు. రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం లాంటి పదవి లేదు.. అయినా నేతలకు ఈ పదవి ఇస్తున్నారు.. ఈ నియామకాలు తప్పని న్యాయవాది తెలిపారు. అంతే, కాకుండా ఇలాంటి నియామకాలు మంత్రుల మధ్య సమానత్వానికి కూడా విరుద్ధమన్నారు.