Revanth vs Harish: అసెంబ్లీలో మాటల యుద్దం మొదలైంది. రేవంత్ vs హరీష్ మాటలతో అసెంబ్లీలో రచ్చకు దారితీసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు కృష్ణ నీళ్లే ప్రాణ ప్రదాయిని అన్నారు. కరీంనగర్ ప్రజలు తరిమేసారని అన్నారు. ఆ వ్యక్తిని పాలమూరు ప్రజలు ఆదరించి ఎంపీగా గెలిపించారని అన్నారు. అలాంటి మహానుభావుడు సభకు రాకుండా ఫార్మ్ హౌస్ లో ఉన్నాడని మండిపడ్డారు. వాస్తవాలు చెప్పాల్సిన అవసరం లేదా ఆయనకు? అంటూ సీఎం ప్రశ్నించారు. తీర్మానానికి మద్దతు చెప్పాల్సిన ప్రతిపక్ష నేత, సభకు రాకుండా ఫార్మ్ హౌస్ లో దాక్కున్నాడని మండిపడ్డారు. కొందరిది దొంగ బుద్ది మార్చుకోవాలని సూచించారు. దొంగలకు సద్దులు మోయడం మానుకోవాలన్నారు. కేసీఆర్ కుర్చీ మొన్న ఖాళీగా ఉండేదని.. ఇప్పుడు ఆ సీట్లో పద్మారావు కూర్చోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆ సీటు పద్మన్నకి ఇవ్వడం మంచిదన్నారు. పద్మన్న ఉద్యమ కారుడని తెలిపారు.
Read also: Valentines Day Special: కల్ట్‌బ్లాక్‌బస్టర్ సినిమాలు ఈ వాలెంటైన్స్ డేలో మరోసారి పెద్ద స్క్రీన్‌లలో….
ఇక మరోవైపు అసెంబ్లీలో హరీష్ రావు మాట్లాడుతూ.. రేవంత్ కూడా తెలంగాణ గురించి మాట్లాడితే.. దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని అన్నారు. రేవంత్ ను కొడంగల్ నుండి తరిమితే.. మల్కాజిగిరి వచ్చావా..? అంటూ సెటైర్ వేశారు. మేము ప్రెసెంటేషన్ ఇవ్వండి అని అడిగినా.. మాకు అవకాశం ఇవ్వలేదని గుర్తు చేశారు. మీరు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని.. ఇది మంచిది కాదని హరీష్ రావ్ మండిపడ్డారు. నల్గొండలో సభ పెట్టినం కాబట్టి.. వాళ్లు తప్పులను తెలుసుకున్నరని అన్నారు. కేసీఆర్ పై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు విత్ డ్రా చేసుకోవాలని కోరారు. లేదంటే మేము మాట్లాడమని అన్నారు. ప్రభుత్వం, ప్రాజెక్టులు అప్పగించమని తీర్మానం చేయడం స్వాగతిస్తున్నామన్నారు.
Ashok Chavan: మహారాష్ట్రలో కాంగ్రెస్ కు భారీ షాక్.. మాజీ సీఎం అశోక్ చవాన్ రాజీనామా.