NTV Telugu Site icon

RBI: మీ దగ్గర పాత రూ.500, 1000 నోట్లు ఉన్నాయా.. మార్చుకునే అవకాశం ఉంది

Old Notes

Old Notes

RBI: మోదీ సర్కారు దేశంలో అవినీతిని అంతమొందించాలన్న లక్ష్యంతో 2016లో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనమే సృష్టించింది. ప్రభుత్వం అప్పుడు 500, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వాటిని బ్యాంకుల్లో మార్చుకోవాలని ప్రజలకు సూచించింది. అయితే ఆ సమయంలో చాలా మంది నోట్లను మార్చుకున్నప్పటికీ.. కొంత మంది వద్ద మాత్రం అవి మిగిలిపోయాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో అనేక పిటీషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. పాత నోట్లను మార్చుకోవాలనుకుంటున్న వ్యక్తుల పిటీషన్లపై శుక్రవారం విచారణ జరిగిపిన ధర్మాసనం ఆర్బీఐకి కీలక సూచనలు చేసింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో కరెన్సీ నోట్లను మార్చుకోలేక పోయిన వారికి పరిష్కారం చూపగలరా అంటూ అత్యున్నత న్యాయ స్థానం రిజర్వు బ్యాంకును కోరింది. సరైన కారణాలతో, నిజాయితీగా అప్పట్లో బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయలేకపోయిన వారి కేసుల విషయంలో పరిష్కారాన్ని చూపాలని సూచించింది.

Read Also: Shraddha Walker Case: శ్రద్ధవాకర్ కేసులో మరో ట్విస్ట్.. హత్య అనంతరం అఫ్తాబ్ డాక్టర్‎తో డేటింగ్

అలాంటి వారికోసం ఇప్పుడు వెసులుబాటు కల్పించేందుకు ఏదైనా అవకాశం ఉందా అని రిజర్వు బ్యాంకును సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఇటీవల కోమాలో ఉన్న ఒక మహిళ తన వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకోలేక పోయిన విషయం ఈ క్రమంలో చర్చించబడింది. అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి బదులిస్తూ.. నోట్ల రద్దు తేదీని పొడిగించలేమని తేల్చి చెప్పారు. అయితే ఆర్బీఐ కొన్ని ప్రత్యేక కేసుల విషయంలో షరతులకు లోబడి వీటిని పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. ఇలా తమవద్ద పాత నోట్లు ఉన్న వారు వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాలని ధర్మాసనం వెల్లడించింది. స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ చట్టాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన కాలంలోపు రద్దైన నోట్లను జమచేయలేకపోయిన వారి విషయంలో ఆర్బీఐ సొంత విచక్షణతో పరిశీలించాలని ధర్మాసనం పేర్కొంది. అయితే ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 5కు వాయిదా వేసింది.

Show comments