Site icon NTV Telugu

Supreme Court: 14 ఏళ్ల బాలిక అబార్షన్కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..

Supreme Court

Supreme Court

అత్యాచారానికి గురి కావడంతో గర్భం దాల్చిన ఓ 14 ఏళ్ల బాలిక అబార్షన్ చేసుకునేందుకు ఇవాళ (సోమవారం) సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తన కుమార్తెకు అబార్షన్ చేయించేందుకు బాంబే హైకోర్టు పర్మిషన్ ఇవ్వకపోవడంతో బాధితురాలి తల్లి అత్యున్నత ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. వైద్యపరంగా అబార్షన్ చేసేందుకు ఉన్న సమయం దాటిపోవడంతో బాధితురాలి అబార్షన్ ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. అయితే, ఆ బాలిక ఆరోగ్య పరిస్థితిని పరీక్షించాల్సిందిగా ఈ నెల 19వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Read Also: Priyanka Chopra: టైగర్‌తో నా కోరిక నెరవేరింది: ప్రియాంక చోప్రా

ఇక, విచారణ సందర్భంగా వైద్య నివేదికలో డాక్టర్లు పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం.. గర్భాన్ని కొనసాగిస్తే అది ఆ బాలిక శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నివేదికలో డాక్టర్లు తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం బాలిక అబార్షన్ కు అనుమతి ఇచ్చారు. కాగా, అంతకుముందు ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదించారు. రేప్ బాధితురాలు ప్రస్తుతం 28 వారాల గర్భంతో ఉందన్నారు. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారం పెళ్లైన మహిళలతో పాటు రేప్ బాధితులు, మైనర్లు, దివ్యాంగులు 24 వారాల్లోగా తమ గర్భాన్ని అబార్షన్ తొలగించుకునే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.

Exit mobile version