Supreme Court: సీజేఐ బెంచ్ ముందుకు చంద్రబాబు పిటిషన్ విచారణ.. కేసు మంగళవారానికి వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో అనూహ్య పరిణామం జరిగింది. నేడు (బుధవారం) ఈ పిటిషన్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ముందుకు వచ్చింది.. న్యాయమూర్తులు ఈ కేసును విచారణ చేసేందుకు విముఖత చూపారు. ఈ పిటిషన్‌పై నాట్ బి ఫోర్ మీ అని ధర్మాసనంలోని జస్టిస్ భట్టి వ్యాఖ్యానించడంతో ఈ పిటిషన్ మరో బెంచ్‌కు బదిలీ అయింది. అయితే, ఈ విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ దగ్గర ప్రస్తావించేందుకు చంద్రబాబు తరఫు లాయర్ సిద్ధార్థ లూథ్రా వెళ్లారు. సీజేఐ ధర్మాసనం ముందు చంద్రబాబు పిటిషన్‌ను ఆయన తరఫున లాయర్లు మెన్షన్ చేసే ప్రయత్నాలు సఫలం అయ్యాయి.
Read Also: USA: “ఫ్లాష్ మాబ్” తరహాలో యాపిల్ స్టోర్‌ని కొల్లగొట్టారు.. వీడియో వైరల్..
Also Read
- YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
- Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
- 50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
- Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్...
ఇక, సీజేఐ ధర్మాసనం ఈ పిటిషన్‌పై వాదనలు వినడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా మీకేం కావాలని చంద్రబాబు తరుఫున లాయర్ సిద్ధార్థ లూథ్రాను సీజేఐ ధర్మాసనం అడిగింది. లూథ్రా వాదనలు వినిపిస్తూ.. కేసు ఈ రోజు లిస్టయినా విచారణకు జరుగలేదు అని తెలిపారు. ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా అరెస్ట్ చేయడం రాజ్యాంగ విరుద్దమని లూద్రా వాదించారు. 17ఏను అనుసరించలేదని ఆయన పేర్కొన్నారు. ఈ సమయంలో సీఐడీ తరఫున లాయర్ రంజిత్.. 17 ఏ సవరణ చేయకముందు ఈ స్కామ్ జరిగిందన్నారు. అనంతరం మరో బెంచ్‌కు కేసును బదిలీచేస్తామని సీజేఐ ధర్మాసనం తెలుపుతూ.. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
Read Also: Maama Mascheendra Trailer: మామను చెడుగుడు ఆడడానికే పుట్టిన అల్లుళ్ల కథ ..
అయితే, సుప్రీం కోర్టుకు రేపటి నుంచి వారం రోజుల పాటు సెలవులు ఉన్న నేపథ్యంలో మంగళవారానికి వాయిదా వేశారు. మిలాద్ ఉన్ నబీ, గాంధీ జయంతి నేపథ్యంలో అక్టోబరు 2 వరకూ వరుస సెలవులు ఉన్నాయి. దీంతో వచ్చే మంగళవారమే ఇక చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ వాయిదా పడటంతో పిటిషన్‌పై కోర్టు నిర్ణయం వెలువడే వరకు చంద్రబాబు జైల్లో ఉండాల్సి వస్తుంది. అంతేకాదు, ఆయన రిమాండ్‌ను కూడా ఏసీబీ కోర్టు వచ్చే నెల 5 వరకు విధించింది. కాగా, స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటీషన్‌పై హైకోర్టు తీర్పును చంద్రబాబు తరఫున లాయర్లు సవాల్ చేస్తూ సుప్రీంలో దాఖలు చేశారు. మరోవైపు, ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్‌పై విచారణ కొనసాగుతుంది.
తాజావార్తలు
-
Cancer Vaccine Breakthrough: కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్‌పై ఆశలు.. మోడెర్నా, మెర్క్ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలు
-
YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
-
Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
-
Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
ట్రెండింగ్
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!