Site icon NTV Telugu

AP Fiber net Case: చంద్రబాబు కేసులో ట్విస్ట్‌… ఇవాళ విచారణకు రాని ఫైబర్‌ నెట్ కేసు

Chandrababu

Chandrababu

AP Fiber net Case: ఏపీ ఫైబర్‌ నెట్‌ కేసులో టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై బుధవారం నాడు విచారణ జరగలేదు. చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఆఖరి నిమిషంలో ఆగిపోయింది. ద్విసభ్య ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ బేలా త్రివేది అందుబాటులో లేరు. దీంతో సుప్రీంకోర్టు స్పెషల్ బెంచ్ ఇవాళ కూర్చోవడం లేదని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అనిరుద్ద బోస్ చెప్పారు. విచారణకు మరో తేదిని కేటాయిస్తామని సుప్రీంకోర్టు జడ్డి అనిరుద్ద బోస్ వెల్లడించారు.

Read Also: Kodikathi Fight: కోడిపందాల విషయంలో వాగ్వివాదం.. కోడికత్తితో యువకుడిపై దాడి

సుప్రీంకోర్టులో ఏపీ సీఐడీ తరఫు న్యాయవాది ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఫైబర్‌ నెట్‌ కేసును విచారించాల్సిన ప్రత్యేక ధర్మాసనం కూర్చోవడం లేదని జస్టిస్ అనిరుద్ధ బోస్ తెలిపారు. ఈ పిటిషన్‌పై విచారణకు మరో తేదీని తెలుపుతామన్నారు. ఈ కేసులో చంద్రబాబు తరపున వాదించడానికి సిద్దార్ధ లూథ్రా కోర్టుకు హాజరయ్యారు. కానీ స్పెషల్ బెంచ్ కూర్చోవడం లేదని జడ్జి చెప్పడంతో మరో తేదీ కోసం ఇరు వర్గాల తరపు న్యాయవాదులు ఎదురు చూస్తున్నారు.

Exit mobile version