Site icon NTV Telugu

Supreem Court: చీతాల మృతిపై సుప్రీం ఆందోళన.. కేంద్రంపై సీరియస్

Supreem

Supreem

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చీతాల వరుస మృతిపై భారత అత్యున్నత న్యాయస్థానం(Supreem Court) ఆందోళన వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వం విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాలు ఒకదాని వెంట ఒకటి మృతి చెందుతుండటంతో.. దేశ వ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయ వ్యాప్తంగా కలకలం రేపుతుంది. చీతాల మృతికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. గతవారం రెండు చీతాలు చనిపోవడాన్ని ప్రస్తావించిన సుప్రీం.. దీనిని ఎందుకు ప్రతిష్టాత్మకంగా మారుస్తున్నారని కేంద్రాన్ని ప్రశ్నించింది. చీతాలు మృత్యువాత పడుతున్నప్పటికీ వాటిని కునో నేషనల్ పార్క్ లో ఎందుకు పెట్టారని నిలదీసింది. వేరే చోటుకు తరలించే ప్రయత్నాలు ఎందుకు చేయలేదని నిలదీసింది.

AP Government: పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై సర్కార్‌ సీరియస్‌.. ఫిర్యాదుకు రంగం సిద్ధం

ప్రభుత్వం తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. ఆపరేషన్ చీతా ప్రాజెక్ట్ కోసం తాము శాయశక్తులా కృషి చేస్తున్నామని కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు. ట్రాన్స్ లోకేషన్‌లో 50 శాతం మరణాలు సాధారణమేనని ఆమె వివరించారు. అయితే వన్యప్రాణులు భారతదేశ వాతావరణానికి సరిపోతాయా, కిడ్నీ, శ్వాస కోశ సమస్యలను ఎదుర్కొంటున్నాయా అనే అంశాన్ని తెలుసుకోవాలని కోర్ట్ ఆదేశించింది. అంటువ్యాధులు వాటి మరణాలకు దారితీస్తున్నాయని సమాధానమిచ్చారు. రాజస్థాన్‌లోని అభయారణ్యాలలో ఒకటి చిరుతపులికి ప్రసిద్ధి చెందిందని కోర్ట్ ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఈ అంశాన్ని కేంద్రం పరిగణనలోనికి తీసుకోవాలని సుప్రీంకోర్ట్ సూచించింది. చీతాల మరణానికి గల కారణాలపై పూర్తి వివరాలను సమర్పించాలని సుప్రీం కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసింది.

GHMC: భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అలర్ట్.. ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

కాగా.. ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను భారత ప్రభుత్వం మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఇండియాలో చీతాల సంతతిని నిలబెట్టడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకోగా.. దీనికి సంబంధించి దక్షిణాఫ్రికాతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. అంతకుముందు గతేడాది సెప్టెంబర్ 17న ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా కునో నేషనల్ పార్క్‌లో నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాలను విడుదల చేశారు. వాటిలో అనారోగ్యం కారణంగా ఒక చీతా మరణించింది.

Exit mobile version