NTV Telugu Site icon

Rajini Kanth : ప్రారంభానికి ముందే డ‌బుల్ ట్రీట్ ప్లాన్ చేస్తున్న రజినీ కాంత్ ?

Rajinikanth

Rajinikanth

Rajini Kanth : వరుస పరాజయాల తర్వాత సూపర్ స్టార్ జైలర్ తో తన స్టామినా ఏంటో చూపించాడు. ఆ తర్వాత రజినీకాంత్ న‌టించిన చిత్రం ‘వేట్టయన్- ద హంట‌ర్‌’. టి.జె.జ్ఞాన‌వేల్ ద‌ర్శక‌త్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్షన్స్ నిర్మించింది. సుభాస్క‌ర‌న్ నిర్మాతగా వ్యవహరించారు. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. రిలీజైన కొద్ది రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇది ఇండియన్ సినిమా చరిత్రలో ఓ మైల్ స్టోన్ అని చెప్పుకోవడమే గాక, లైకా ప్రొడ‌క్ష‌న్స్ కి మంచి బూస్టింగ్ అని చెప్పొచ్చు.

Read Also:Dulquer Salmaan : అరుదైన ఘనత సాధించిన ‘లక్కీ భాస్కర్’

ఈ సినిమా తర్వాత రజనీకాంత్ కొత్త సినిమా ప్రారంభానికి ముందే డ‌బుల్ ట్రీట్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అందుకు ‘జైల‌ర్’ మేక‌ర్ నెల్స‌న్ తోడ‌వుతున్నాడా? అంటే అవునని అంటున్నారు. ప్రస్తుతం ర‌జ‌నీకాంత్ ‘కూలీ’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆఖరి దశలో ఉంది. ఇది పూర్తయిన తర్వాత వెంటనే జైల‌ర్ డైరెక్టర్తో జైల‌ర్ -2 మొదలు పెట్టాలని ర‌జనీ సిద్ధం అవుతున్నారు. అయితే ప్రారంభానికి ముందే ర‌జ‌నీ లుక్ రెడీ అయిపోయింది.

Read Also:Bangladesh: బంగ్లాదేశ్‌లో రెండో హిందూ పూజారి అరెస్ట్..

ప్రముఖ స్టైలిస్ట్ అలీం హ‌కీమ్ ఈ లుక్ డిజైన్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. అతి త్వర‌లోనే సూప‌ర్ స్టార్ కొత్త లుక్ చూస్తారంటూ ఇన్ స్టా వేదిక‌గా అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 12 రజనీ పుట్టిన రోజు సందర్భంగా అధికారికంగా ప్రకటిస్తారు. ఆ రోజునే ఫ‌స్ట్ లుక్ రివీల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దాంతో పాటు సినిమాకి సంబంధించిన ఓ ప్రోమో టీజ‌ర్ ని కూడా యూనిట్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే ఒకేసారి అభిమానుల కోసం డ‌బుల్ ట్రీట్ ప్లాన్ చేసినట్లు అర్థం అవుతుంది. జైలర్ 2 సినిమా షూటింగ్ వ‌చ్చే ఏడాది మొల‌వుతుంద‌ని స‌మాచారం. డైరెక్టర్ నెల్సన్ అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో విడుదలైన అయిన ‘జైల‌ర్’ ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే.

Show comments