Rajini Kanth : ప్రారంభానికి ముందే డబుల్ ట్రీట్ ప్లాన్ చేస్తున్న రజినీ కాంత్ ?
- రజినీ బర్త్ డే సందర్భంగా డబుల్ ట్రీట్
- వచ్చే నెలలో ప్రారంభం కానున్న జైలర్ 2 షూటింగ్
- లుక్, టీజర్ ఒకే రోజు విడుదలకు ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajini Kanth : వరుస పరాజయాల తర్వాత సూపర్ స్టార్ జైలర్ తో తన స్టామినా ఏంటో చూపించాడు. ఆ తర్వాత రజినీకాంత్ నటించిన చిత్రం ‘వేట్టయన్- ద హంటర్’. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. సుభాస్కరన్ నిర్మాతగా వ్యవహరించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. రిలీజైన కొద్ది రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇది ఇండియన్ సినిమా చరిత్రలో ఓ మైల్ స్టోన్ అని చెప్పుకోవడమే గాక, లైకా ప్రొడక్షన్స్ కి మంచి బూస్టింగ్ అని చెప్పొచ్చు.
Read Also:Dulquer Salmaan : అరుదైన ఘనత సాధించిన ‘లక్కీ భాస్కర్’
Also Read
- Rajamahendravaram: గోదావరిలో హౌస్‌బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్‌గా మార్చేసే సింపుల్ ట్రిక్
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్‌డీఏకు హైకోర్టు షాక్..!
- Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
ఈ సినిమా తర్వాత రజనీకాంత్ కొత్త సినిమా ప్రారంభానికి ముందే డబుల్ ట్రీట్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అందుకు ‘జైలర్’ మేకర్ నెల్సన్ తోడవుతున్నాడా? అంటే అవునని అంటున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ ‘కూలీ’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆఖరి దశలో ఉంది. ఇది పూర్తయిన తర్వాత వెంటనే జైలర్ డైరెక్టర్తో జైలర్ -2 మొదలు పెట్టాలని రజనీ సిద్ధం అవుతున్నారు. అయితే ప్రారంభానికి ముందే రజనీ లుక్ రెడీ అయిపోయింది.
Read Also:Bangladesh: బంగ్లాదేశ్‌లో రెండో హిందూ పూజారి అరెస్ట్..
ప్రముఖ స్టైలిస్ట్ అలీం హకీమ్ ఈ లుక్ డిజైన్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే సూపర్ స్టార్ కొత్త లుక్ చూస్తారంటూ ఇన్ స్టా వేదికగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 12 రజనీ పుట్టిన రోజు సందర్భంగా అధికారికంగా ప్రకటిస్తారు. ఆ రోజునే ఫస్ట్ లుక్ రివీల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దాంతో పాటు సినిమాకి సంబంధించిన ఓ ప్రోమో టీజర్ ని కూడా యూనిట్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే ఒకేసారి అభిమానుల కోసం డబుల్ ట్రీట్ ప్లాన్ చేసినట్లు అర్థం అవుతుంది. జైలర్ 2 సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మొలవుతుందని సమాచారం. డైరెక్టర్ నెల్సన్ అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో విడుదలైన అయిన ‘జైలర్’ ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే.
తాజావార్తలు
-
Suryakumar Yadav: తప్పంతా నాదే.. వన్డే కెరీర్‌పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు!
-
IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
-
NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
-
Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
-
China: వేలాది కుటుంబాల కన్నీటి వేదన..నిజాలను సమాధి చేసే పాలన.. చైనా నిజస్వరూపం ఇదే!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!