Site icon NTV Telugu

IPL Auction 2025: ఆ విదేశీ ప్లేయర్‌లను బ్యాన్ చేయండి.. బీసీసీఐని కోరిన కావ్య మారన్!

Kavya Maran

Kavya Maran

SRH CEO Kavya Maran proposals for IPL 2025 Auction: ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించి బుధవారం ముంబైలో 10 ప్రాంచైజీల ఓనర్లతో బీసీసీఐ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం వాడివేడిగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో అన్ని ఫ్రాంచైజీల ఓనర్లు ఏకాభిప్రాయం వ్యక్తం చేయకపోగా.. తమ డిమాండ్లను బీసీసీఐ ముందు ఉంచారు. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్.. మెగా వేలంలో ప్లేయర్ రిటెన్షన్ కోసం కొన్ని ఎంపికలను బీసీసీఐకి సూచించినట్లు తెలుస్తోంది.

ఈఎస్‌పీఎన్-క్రిక్‌ఇన్ఫో నివేదిక ప్రకారం… రిటైన్డ్ లిస్ట్ లేదా రైట్ టూ మ్యాచ్ (ఆర్‌టీఎమ్) ద్వారా మొత్తంగా ఆరుగురు ఆటగాళ్లను తమ ఫ్రాంచైజీ అట్టిపెట్టుకునే వెసులుబాటు కల్పించాలని బీసీసీఐని కావ్య మారన్ కోరారట. ‘ఐపీఎల్ 2025లో కొన్ని నిబంధనలు మార్చాలి. నలుగు ప్లేయర్లను రిటైన్ చేసుకోవడం లేదా ఇద్దరు ఆటగాళ్లను ఆర్‌టీఎమ్ ద్వారా సొంతం చేసుకునేలా ఉండాలి. ఆరుగురుని రిటైన్డ్ చేసుకోవడం లేదా ఆరుగురిని ఆర్‌టీఎమ్ ద్వారా ఉంచుకునేలా చూడాలి. ఆటగాడితో చర్చించి రిటైన్డ్ లేదా ఆర్‌టీఎమ్‌తో వెళ్లాలా అనే వెసులుబాటు ఇవ్వాలి. ఎందుకంటే ఓ ప్లేయర్ రిటైన్డ్‌ను, మరొ ప్లేయర్ ఆర్‌టీఎమ్‌ను ఇష్టపడతారు. ఏదైనా ప్లేయర్ అసంతృప్తి చెందకుండా ఉండేలా చేయాలి’ అని కావ్య అన్నారు.

Also Read: Virat Kohli-Chokli: ‘చోక్లీ’ అంటూ కామెంట్‌ చేసిన శ్రీలంక ఫ్యాన్.. విరాట్ కోహ్లీ రియాక్షన్ ఇదే!

‘ప్రతి జట్టు విభిన్నంగా జట్టును నిర్మించుకుంటాయి. కొన్ని జట్లలో విదేశీ ఆటగాళ్లు, మరికొన్ని జట్లలో ఇండియన్ ప్లేయర్లు బలంగా ఉంటారు. కాబట్టి క్యాప్డ్/అన్‌క్యాప్డ్/ఓవర్సీస్ ప్లేయర్ల సంఖ్య పరిమితం చేయకూడదు. ఇది ఫ్రాంచైజీల ఇష్టానుసారంగా ఉండాలి. వేలంలో కొన్న తర్వాత గాయంతో కాకుండా ఇతర కారణాలతో వైదొలిగే విదేశీ ఆటగాళ్లను టోర్నీ నుంచి నిషేధించాలి. ఎందుకంటే టీమ్ కాంబినేషన్ కోసం ఫ్రాంచైజీ ఎంతో శ్రమిస్తుంది. తీరా అతడు అందుబాటులో లేకపోతే జట్టు కాంబినేషన్‌పై ప్రభావం పడుతుంది. విదేశీ ప్లేయర్లు అందుబాటులో లేని సందర్భాలు చాలా ఉన్నాయి’ అని కావ్య మారన్ పేర్కొన్నారు.

 

Exit mobile version