SRH vs DC: ఐపీఎల్ 2024 సీజన్‌లో వరుసగా భారీ స్కోర్లు చేస్తూ వస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి పరుగుల వరద పారించింది.. ఐపీఎల్ 2024లో 35వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడుతోన్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మళ్లీ రికార్డులు సృష్టించింది.. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ట నష్టానికి 266 పరుగులు చేసిన హైదరాబాద్ జట్టు.. ఢిల్లీ ముందు.. 267 భారీ లక్ష్యాన్ని పెట్టింది.. ఇక, మూడు ఓవర్లలో SRH 62 పరుగులు చేసింది. దీంతో ట్రావిస్ హెడ్ కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది ఆల్ టైమ్ రికార్డ్. కోల్‌కతా నైట్ రైడర్స్ 105 పరుగులు చేసి రికార్డు సృస్టించగా.. ఆ రికార్డును బ్రేక్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం 6 ఓవర్లలో 125 పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.
పవర్ ప్లే పరుగులు వరద పారించిన ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లకు ఢిల్లీ బౌలర్లు అడ్డుకట్ట వేశారు. కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు తీశాడు. అభిషేక్ 46 పరుగులు చేయగా, కెప్టెన్ మార్క్రామ్ ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ట్రావిస్ హెడ్ 89 పరుగులతో తన అద్భుతమైన ఇన్నింగ్స్‌ను ముగించాడు. క్లాసిక్ ప్లేయర్ క్లాసన్ కేవలం 15 పరుగులకే పెవిలియన్ చేరారు.. ఇక, నితీష్ 27 బంతుల్లో 37 పరుగులు చేసి డేవిడ్ వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సమద్ 13 పరుగులు చేసి ఔటయ్యాడు. కమిన్స్ ఒక్క పరుగుకే అవుటయ్యాడు. షాబాజ్ కూడా హాఫ్ సెంచరీ సాధించి జట్టుకు సహకరించాడు. దీంతో 20 ఓవర్లలో SRH 7 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. గెలవాలంటే ఢిల్లీ 267 పరుగులు చేయాల్సి ఉంది.
ట్రావిస్ హెడ్.. ఢిల్లీ బౌలర్లను ఊచ కోత కోస్తూ కేవలం 32 బంతుల్లోనే 11 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవడగా.. అభిషేక్ శర్మ.. కేవలం 12 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, రెండు ఫోర్ల సాయంతో 46 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.. ఇక, షాబాజ్ 29 బంతుల్లో 59 పరుగులు చేసి టీమ్‌కు సపోర్ట్‌గా నిలిచారు.. నితీష్ 27 బంతుల్లో 37, క్లాసెన్ 8 బంతుల్లో 15 పరుగులు, సమద్ 8 బంతుల్లో 13 పరుగులు సాధించారు. అయితే, టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. బ్యాటింగ్‌లో ఎలా రాణిస్తుందో చూడాలి.