NTV Telugu Site icon

Sunrisers Eastern Cape: వరుసగా రెండోసారి టైటిల్ గెలిచిన సన్ రైజర్స్.. కావ్య రచ్చ మాములుగా లేదుగా..!

Kavya

Kavya

సౌతాఫ్రికాలో జరిగిన ఎస్ఏ టీ20 లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకుంది. నిన్న కేప్ టౌన్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ 89 పరుగుల భారీ తేడాతో డర్బన్ సూపర్ జెయింట్స్ పై గెలుపొందింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 204 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బ్యాటింగ్లో జోర్డాన్ హెర్మన్ 42, అబెల్ 55, కెప్టెన్ మార్ క్రమ్ 42 నాటౌట్, ట్రిస్టాన్ స్టబ్స్ 56 నాటౌట్ పరుగులతో భారీ స్కోరును నమోదు చేశారు.

Buddha Venkanna: టికెట్ ఇవ్వకపోతే చంద్రబాబుపై ప్రేమ పోరాటం చేస్తా..

అనంతరం 205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన డర్బన్ సూపర్ జెయింట్స్ 115 పరుగులకే ఆలౌటైంది. సన్ రైజర్స్ బౌలర్లు 17 ఓవర్లలోనే ఆటను ముగించారు. యువ ఆల్ రౌండర్ మార్కో యన్సెన్ అద్భుత బౌలింగ్ తో 5 వికెట్లు పడగొట్టాడు. కాగా.. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుకు ఫ్రాంచైజీ ఎవరంటే కావ్య మారన్. ఐపీఎల్లో అంతగా అలరించకపోయిన సన్ రైజర్స్ జట్టు.. సౌతాఫ్రికాలో మాత్రం రెండోసారి టైటిల్ గెలుచుకుంది. దీంతో సన్ రైజర్స్ ఫ్రాంచైజీ యజమాని కావ్యా మారన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఫైనల్ మ్యాచ్ ను తిలకించిన కావ్యా మారన్.. డర్బన్ జట్టు చివరి వికెట్ కోల్పోగానే ఎగిరి గంతులేసింది. ఆ తర్వాత.. సన్ రైజర్స్ ఆటగాళ్లతో తన ఆనందాన్ని పంచుకున్నారు. అంతేకాకుండా.. ట్రోఫీని సన్‌ రైజర్స్‌ కెప్టెన్‌ మార్‌క్రమ్‌ కావ్య మారన్‌ చేతికి అందించారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. కాగా.. సన్‌ రైజర్స్‌ ఫ్రాంఛైజీ ఐపీఎల్ లో రెండు టైటిల్స్ గెలుచుకుంటే.. సౌతాఫ్రికా లీగ్‌లో రెండు టైటిల్స్ 2023, 2024 సీజన్‌లలో గెలుపొందింది.

Kishan Reddy : ఈ నెల 20 నుండి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు