Sunil Gavaskar: వన్డే ప్రపంచకప్ గెలవడం ఎంత ముఖ్యమో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కూడా అంతే ముఖ్యమని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. సామాన్యుడు పోటీని చాలా మక్కువతో పట్టించుకుంటాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. అక్టోబర్ 14న భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. సామాన్యులు ఈ మ్యాచ్‌ను గొప్పగా చూస్తారని, అందుకే ఇది టోర్నమెంట్‌లోనే అత్యంత ముఖ్యమైన మ్యాచ్ లలో ఒకటిగా ఉంటుందని చెప్పాడు.
Read Also: Rahul Gandhi: అమ్మ సోనియాకు రాహుల్ గాంధీ సర్‌ప్రైజ్ గిఫ్ట్..
మరోవైపు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. వన్డే ప్రపంచకప్‌కు ముందు పాకిస్థాన్ తమ ఫామ్‌ను బట్టి టైటిల్ పోటీదారుగా చూడడం లేదని అన్నారు. ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ ముందుకు వెళ్లేలా కనిపించడం లేదని తెలిపారు. పాకిస్తాన్ T20 జట్టు బలంగా ఉన్నప్పటికీ.. ఆసియా కప్, వార్మప్ మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శన చూపించిందన్నారు.
Read Also: Business Ideas: కేవలం రూ.10 వేలతో అదిరిపోయే లాభాలు పొందే బిజినెస్ లు ఇవే..
వన్ డే ప్రపంచ కప్‌లో భారతదేశం-పాకిస్థాన్ మధ్య పోటీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంటందని అంచనా వేయడం కష్టం. 1992లో జరిగిన ప్రపంచ కప్‌లో ఈ జట్లు తొలిసారిగా తలపడ్డాయి. భారత్ 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. అప్పటి నుండి భారతదేశం ప్రపంచ కప్ మ్యాచ్‌లలో పాకిస్తాన్‌పై పగలని విజయ పరంపరను కొనసాగించింది. ఏడుసార్లు జరిగిన మ్యాచ్లలో ఏడు మ్యాచ్ లు ఇండియానే గెలిచింది. మరి ఈసారి జరగబోయే ప్రపంచకప్లో ఏ జట్టు గెలుస్తుందో చూడాలి.
