ఏపీలో వైసీపీ పాలనపై మండిపడ్డారు బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ సహా ఇంచార్జ్ సునీల్ థియోధర్. వైసీపీ ల్యాండ్ మాఫియా పార్టీగా మారింది. అనంతపురంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పరిశ్రమలు అన్నీ వెనక్కి పోతున్నాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇక్కడ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. బాబు వస్తే జాబు వస్తుందన్నారు.. కానీ తన కొడుక్కి మాత్రమే జాబ్ వచ్చింది. చంద్రబాబు పర్యటనల్లో జనం చనిపోతున్నా లెక్క చేయడం లేదు. వైసీపీ, టీడీపీలు రెండూ కుల, కుటుంబ, అవినీతి పార్టీలుగా మారాయన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ వలన ఎలాంటి నష్టం లేదన్నారు సునీల్ థియోధర్.
Read Also: Threat Call : సీఎంను చంపేస్తాం.. ఢిల్లీనుంచి బెదిరింపు కాల్
ప్రత్యేక హోదా చంద్రబాబు హయాంలోనే ముగిసిన అధ్యాయం. లోకేష్ పాదయాత్ర వలన ఎలాంటి ప్రయోజనం లేదు. గోదావరి పుష్కరాల్లో జనాన్ని బలి తీసుకున్నారు. ఎండోమెంట్ నుంచి పాస్టర్లకు వేతనాలు ఇస్తున్నారు. ఇదేం విధానం? అని మండిపడ్డారు. వారు హిందూ మతాన్ని దెబ్బతీస్తున్నారు. హిందువుల డబ్బుతో వారిని పోషిస్తున్నారు. జగన్ తెలుగు భాషను చంపేస్తున్నా.. చంద్రబాబు స్పందించడం లేదు. మార్చి 10 నుంచి మార్చి30 బీజేపీ యాత్ర కొనసాగుతుంది.ఈ రెండు పార్టీల విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. జి20 సదస్సు పై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నాం. రాయలసీమ ప్రాంతంలో ముఖ్యమంత్రులు ఉన్నా ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందన్నారు. ఎంతో విలువైన చిరుధాన్యాల సాగుపై వారు దృష్టి సారించలేదన్నారు.
Read Also: Naked Woman: ఏమ్మా ! ఇది ఎయిర్ బస్ అనుకున్నావా.. ఎర్రబస్ అనుకున్నావా