Sunil Chhetri-Virat Kohli: కోహ్లీలోని మరో కోణం చాలా మందికి తెలియదు: ఛెత్రీ
- ఇటీవలే ఫుట్‌బాల్‌కు ఛెత్రీ వీడ్కోలు
- టీ20లకు కోహ్లీ గుడ్‌బై
- మా భావం ఒక్కటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunil Chhetri Says Virat Kohli Sends Funny Memes: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, తాను మంచి స్నేహితులమని భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రీ తెలిపారు. కోహ్లీలోని మరో కోణం చాలా మందికి తెలియదన్నారు. తామిమిద్దరం ఒకే ప్లేస్ నుంచి వచ్చాం అని, ఒకే లాంటి కలలు కన్నాం అని పేర్కొన్నారు. ప్రతీ విషయం గురించి తాము మాట్లాడుకుంటామని ఛెత్రీ చెప్పారు. ఫుట్‌బాల్‌కు ఛెత్రీ ఇటీవలే వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. కోహ్లీ కూడా టీ20లకు గుడ్‌బై చెప్పేశాడు. ఈ సందర్భంగా తన స్నేహితుడు విరాట్ గురించి ఛెత్రీ ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.
యూట్యూబ్ రాజ్ షమణి పోడ్కాస్ట్లో సునీల్ ఛెత్రీ మాట్లాడుతూ… ‘విరాట్ కోహ్లీ అద్భుతమైన వ్యక్తి. చాలా మందికి అతడిలోని మరో కోణం తెలియదు. విరాట్ చాలా ఫన్నీగా ఉంటాడు. ఇలాంటి వ్యక్తి దొరకడం చాలా కష్టం. విరాట్, నేను ఒకే ప్లేస్ నుంచి వచ్చాం. ఒకేలాంటి కలలు కన్నాం. విభిన్న గేమ్‌లను ఎంచుకున్నప్పటికీ.. మా భావం మాత్రం ఒక్కటే. కోహ్లీపై నాకున్న గౌరవం ఎప్పటికీ తగ్గదు. అతడితో చాటింగ్ చేస్తుంటే ఎక్కువగా ఫన్నీ మీమ్స్‌ను పంపుతుంటాడు. ప్రతీ విషయం గురించి మేం మాట్లాడుకుంటాం’ అని చెప్పారు.
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
Also Read: Couples Viral video: పెళ్లిలో ప్రీ వెడ్డింగ్ వీడియో.. తమ డాన్స్‌నే చూసి తెగ నవ్వుకున్న వధూవరులు!
జూన్ 6న కువైట్‌తో జరిగిన ప్రపంచకప్ అర్హత మ్యాచ్ అనంతరం సునీల్ ఛెత్రీ రిటైర్ అయ్యారు. 2005లో అరంగేట్రం చేసిన ఈ స్ట్రైకర్.. 94 గోల్స్ కొట్టారు. దేశం తరఫున అత్యధిక గోల్స్ కొట్టిన, అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా కెరీర్‌ను ముగించారు. భారత్ మూడు సార్లు (2007, 2009, 2012) నెహ్రూ కప్, మూడు సార్లు (2011, 2015, 2021) సౌత్ ఏషియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ (శాఫ్) ఛాంపియన్షిప్ గెలవడంలో ఛెత్రి కీలక పాత్ర పోషించారు. 2008 ఏఎఫ్సీ ఛాలెంజ్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు కూడా.
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!