Virat Kohli Records: “నువ్వు మామూలోడివి కాదు సామీ”.. ఒక్క సెంచరీతో ఏకంగా 10 సంచలన రికార్డులు బద్దలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Records: తిరువనంతపురం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విండీస్ విసిరిన 296 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 41.4 ఓవర్లలోనే ఊదేసింది. ఈ గెలుపులో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇద్దరూ సెంచరీలతో చెలరేగిపోయారు. గిల్ 108 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 110 పరుగులు చేయగా, కోహ్లీ మాత్రం వీరవిహారం చేశాడు. కేవలం 88 బంతుల్లోనే 10 ఫోర్లు, 9 సిక్సర్లతో నాకౌట్‌గా 139 పరుగులు బాదేశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 151 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పేశారు. గిల్‌కి ఇది వన్డేల్లో 10వ సెంచరీ కాగా, కోహ్లీకి ఇది 55వ వన్డే సెంచరీ, అలాగే మొత్తంగా 86వ అంతర్జాతీయ శతకం కావడం విశేషం. ఈ తుఫాన్ ఇన్నింగ్స్‌తో కోహ్లీ ఏకంగా 10 రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఆ సంచలన రికార్డులేంటో ఇప్పుడు చూద్దాం.
1.వన్డేల్లో అత్యంత వేగంగా 15 వేల పరుగులు
వన్డేల్లో అత్యంత వేగంగా 15,000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్‌ను వెనక్కి నెట్టాడు. కోహ్లీ కేవలం 303 ఇన్నింగ్స్‌ల్లో (15,950 బంతుల్లో) ఈ మైలురాయిని చేరుకోగా, సచిన్ దీనికోసం 377 ఇన్నింగ్స్‌లు (17,528 బంతులు) తీసుకున్నాడు.
సచిన్ vs కోహ్లీ (15K వన్డే పరుగులు):
వయసు: సచిన్ (34 ఏళ్ల 66 రోజులు) | కోహ్లీ (37 ఏళ్ల 326 రోజులు)
ఇన్నింగ్స్‌లు: సచిన్ (377) | కోహ్లీ (303)
బంతులు: సచిన్ (17,528) | కోహ్లీ (15,950)
డెబ్యూ నుంచి రోజులు: సచిన్ (6,402) | కోహ్లీ (6,614)
Also Read
- Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
2. ఎలైట్ క్లబ్లో కేవలం ఇద్దరే!
ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలోనే 15 వేల పరుగులు దాటిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు. సచిన్ (463 మ్యాచుల్లో 18,426 పరుగులు) తర్వాత ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడు కోహ్లీనే (315 మ్యాచుల్లో 15,080 పరుగులు).
3. ఒకే జట్టుపై అత్యధిక సెంచరీలు
వెస్టిండీస్‌పై కోహ్లీకి ఇది 10వ వన్డే సెంచరీ. శ్రీలంక తర్వాత ఒకే జట్టుపై 10 సెంచరీలు కొట్టడం విరాట్‌కు ఇది రెండోసారి. వన్డేల్లో ఒకే జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కోహ్లీ పేరిటే ఉంది.
విరాట్ కోహ్లీ vs శ్రీలంక: 10 సెంచరీలు
విరాట్ కోహ్లీ vs వెస్టిండీస్: 10 సెంచరీలు
సచిన్ టెండూల్కర్ vs ఆస్ట్రేలియా: 9 సెంచరీలు
రోహిత్ శర్మ vs ఆస్ట్రేలియా: 9 సెంచరీలు
4. మూడో ఫాస్టెస్ట్ వన్డే సెంచరీ
ఈ మ్యాచ్‌లో కోహ్లీ 74 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో బంతుల పరంగా ఇది కోహ్లీకి మూడో వేగవంతమైన సెంచరీ (గతంలో ఆస్ట్రేలియాపై 52, 61 బంతుల్లో సెంచరీలు కొట్టాడు).
5. లిస్ట్-ఎ క్రికెట్లో సచిన్ సరసన
లిస్ట్-ఎ (వన్డేలతో కలిపి) క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డులో సచిన్ (60 సెంచరీలు – 538 ఇన్నింగ్స్‌లు) సరసన కోహ్లీ (60 సెంచరీలు – 338 ఇన్నింగ్స్‌లు) చేరాడు. వీరి తర్వాత స్థానాల్లో గ్రహాం గూచ్ (44), గ్రీమ్ హిక్ (40) ఉన్నారు.
6. స్వదేశంలో 42వ అంతర్జాతీయ సెంచరీ
భారత గడ్డపై అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీకి ఇది 42వ సెంచరీ (260 ఇన్నింగ్స్‌ల్లో). దీంతో స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ (313 ఇన్నింగ్స్‌ల్లో 42 సెంచరీలు) రికార్డును కోహ్లీ సమం చేశాడు.
7. రన్ ఛేజింగ్ గెలుపుల్లో పాంటింగ్‌ను దాటేసి..
వన్డేల్లో లక్ష్య ఛేదనలో (రన్ ఛేజ్) జట్టును అత్యధిక సార్లు విజేతగా నిలిపిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ (112 విజయాలు) ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ (111)ను దాటేశాడు. ఈ జాబితాలో సచిన్ (127), ధోనీ (116)ల తర్వాత కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు.
8. అల్జారీ జోసెఫ్‌పై విరుచుకుపడి..
ఈ మ్యాచ్‌లో విండీస్ ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లోనే కోహ్లీ ఏకంగా 53 పరుగులు రాబట్టాడు. ఒకే వన్డే మ్యాచ్‌లో ఒక బౌలర్‌పై కోహ్లీ సాధించిన రెండో అత్యధిక పరుగులు ఇవే (2016లో ట్రెంట్ బౌల్ట్పై 54 పరుగులు చేశాడు).
9. కెరీర్లో తొలిసారి 9 సిక్సర్లు
తన వన్డే కెరీర్లో ఒకే మ్యాచ్‌లో కోహ్లీ 9 సిక్సర్లు బాదడం ఇదే తొలిసారి. ఇంతకుముందు 2023లో ఇదే తిరువనంతపురం మైదానంలో శ్రీలంకపై 8 సిక్సర్లు కొట్టాడు.
10. స్వదేశంలో 7,000 పరుగులు సాధించిన ఏకైక బ్యాటర్
స్వదేశంలో జరిగిన వన్డే మ్యాచుల్లో 7,000 పరుగులు పూర్తి చేసుకున్న ప్రపంచంలోనే మొదటి బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు (ప్రస్తుతం 7,006 పరుగులు). సచిన్ టెండూల్కర్ తన 23 ఏళ్ల కెరీర్లో భారత్‌లో 6,976 వన్డే పరుగులు చేశారు.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!