NTV Telugu Site icon

Cannes 2024: కేన్స్‌లో అదరగొట్టిన ఇండియన్‌ షార్ట్‌ ఫిల్మ్‌.. మొదటి బహుమతి సొంతం..

Cannes 2024

Cannes 2024

ప్రస్తుతం ఫ్రాన్స్‌లో 76వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చూసే కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ చిత్రోత్సవాలు మే 25 న ముగియనున్నాయి. ఇంతటి ప్రతిష్ఠాత్మక కేన్స్‌ చిత్రోత్సవాల్లో భారత్‌ కు చెందిన ‘సన్‌ఫ్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్ వన్‌ టు నో’ షార్ట్‌ ఫిలిం సత్తా చాటుకుంది. ఈ షార్ట్‌ ఫిలింకు ఏకంగా ‘2024 ఉత్తమ షార్ట్‌ ఫిలిం’ బహుమతిని సొంతం చేసుకుంది. ఎస్ చిదానంద నాయక్ తెరకెక్కించిన ఈ ‘సన్‌ఫ్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్ వన్‌ టు నో’ అనే లఘు చిత్రం వివిధ భాషలకు చెందిన 17 చిత్రాలతో పోటీ పడి విజేతగా నిలిచింది. ఈ పోటీలకు ప్రపంచవ్యాప్తంగా 555 ఫిల్మ్ స్కూల్స్ నుండి 2,263 మంది దరఖాస్తుదారులు వచ్చాయి. ఈ షార్ట్‌ ఫిలింను 16 నిమిషాల పాటు నిడివితో కన్నడ జానపద కథ ఆధారంగా తెరకెక్కించారు.

Virat Kohli Restaurant: గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్ లో కోహ్లి అడ్డా రెడీ..

ఇప్పుడు ఈ షార్ట్‌ ఫిల్మ్ హాలీవుడ్‌ తో ఫిలిమ్స్ తో పోటీ పడి మొదటి బహుమతి గెలుచుకోవడం పై చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసారు. ఇక ఇదే క్యాటగిరిలో మీరట్‌లో జన్మించిన భారతీయ చిత్రనిర్మాత మహేశ్వరి రూపొందించిన ఓ యానిమేటెడ్‌ చిత్రం ‘బన్నీ హుడ్‌’. ఇది కూడా ఈ పోటీలో తృతీయ బహుమతి గెలుచుకోవడం విశేషం. మే 23న బునుయెల్‌ థియేటర్‌ లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరగగా.. అక్కడ ఉత్తమ లఘు చిత్రానికి గాను 15,000 యూరోలు బహుమతిని అందించారు.