యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన మైఖేల్ మూవీ గతేడాది ఫిబ్రవరి 3న పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజైంది. భారీ యాక్షన్ డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.అయితే విడుదల అయినా తరువాత దారుణంగా బోల్తా కొట్టింది. కానీ ఈ విషయం తనకు ముందే తెలుసని తాజాగా ఊరు పేరు భైరవకోన మూవీ ప్రమోషన్లలో భాగంగా సందీప్ కిషన్ చెప్పడం గమనార్హం.” మైఖేల్ సినిమా థియేటర్లలో బాగా ఆడలేదు. ఆదాయం సంగతి పక్కన పెడితే.. ఆ సినిమా ఎందుకో నాకే నచ్చలేదు. అదే విషయం డైరెక్టర్ తోనూ చెప్పాను. మా దగ్గర మంచి ఫుటేజీ ఉంది. మైఖేల్ అద్భుతంగా ఉండేది. కానీ ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఆ మ్యాజిక్ అయితే జరగలేదు. ఏదో తప్పు జరిగింది” అని సందీప్ కిషన్ అన్నారు.అంతేకాదు ఓ ప్రొడ్యూసర్ తనకీ విషయం ముందే చెప్పాడని కూడా ఆయన వెల్లడించాడు.
మైఖేల్ మూవీని ముగ్గురు ప్రొడ్యూసర్లు తెరకెక్కించారు. “ఇద్దరు ప్రొడ్యూసర్లు సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని తెలిపారు.. కానీ ఒక ప్రొడ్యూసర్ మాత్రం సినిమా బాగా రాలేదని నాతో అన్నారు.ఈ విషయం మూవీ రిలీజ్ కు 12 రోజుల ముందే ఆయన నాతో చెప్పారు.. రిలీజ్ కు ఎక్కువ సమయం లేకపోవడంతో నేను కూడా సరిగా చూడలేకపోయాను. ఆ ఒత్తిడి వద్దని అనుకున్నాను. రిలీజ్ కు ముందు రోజు సినిమా చూసిన తర్వాత నాకు కూడా బాగా లేదనిపించింది” అని సందీప్ తెలిపాడు..మొదట్లో కొన్ని సీన్లు చూసిన తర్వాత సినిమా బాగా ఆడుతుందని నేను అనుకున్నాను. కానీ మొత్తం సినిమా చూసిన తర్వాత ఈ సీన్లు మాత్రమే కాదు మొత్తం సినిమా ఆడియెన్స్ కు కనెక్ట్ కావాలని అయితే నాకు అనిపించింది. సినిమాలో ఎక్ట్స్రార్డినరీ సీన్ ఒకటి ఉండొచ్చు. కానీ అంతకంటే ముందు సీన్ అలా లేకపోతే లాభం లేదు. సాంకేతికంగా మైఖేల్ అద్భుతమైన సినిమా. కానీ మేము చెప్పాలనుకున్న స్టోరీని మాత్రం సరిగా చెప్పలేకపోయాం. సినిమా ఫలితమేంటో నాకు ముందే తెలిసిపోయింది” అని సందీప్ కిషన్ తెలిపారు.