Sundeep Kishan : సైన్స్ ఫిక్షన్ సినిమాలో నటించబోతున్న సందీప్ కిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ సరి కొత్త తరహా చిత్రాలలో తనదైన నటన కనబరుస్తూ తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు.ప్రస్తుతం ఈ యంగ్ హీరో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ‘ఊరు పేరు భైరవకోన అనే సినిమా’ చేస్తున్న సందీప్ కిషన్ ఆ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం 26 చేయడానికి కూడా సైన్ చేశారు. మాయవన్ బ్లాక్ బస్టర్ తర్వాత హీరో సందీప్ కిషన్ మరియు దర్శకుడు సివి కుమార్ ఈ చిత్రం కోసం మరోసారి కలిసి పని చేస్తున్నారు. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణ లో రాంబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే కిషోర్ గరికిపాటి (జికె) ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వున్నారు.మాయవన్ వరల్డ్ నేపథ్యంలో సాగే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం, మాయవన్‌కి సీక్వెల్ కానున్నట్లు తెలుస్తుంది.
టాప్-క్లాస్ ప్రొడక్షన్ మరియు హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రం ఒక సామాన్యుడి ఘర్షణ కథగా వుండబోతుంది.అయితే ఈరోజు లాంఛనం గా పూజా కార్యక్రమాలతో ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ అయింది. ముహూర్తం షాట్‌కు దామోదర్ ప్రసాద్ క్లాప్ ఇవ్వగా, వెంకట్ బోయనపల్లి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి షాట్‌కి జెమినీ కిరణ్ దర్శకత్వం వహించారు. నవంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.ఇంకా టైటిల్ పెట్టని ఈ చిత్రంలో ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ సినిమాకు కార్తీక్ కె తిల్లై సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు., నాని దసరాకి అదిరిపోయే ఆల్బమ్ అందించి మంచి పేరు తెచ్చుకున్న సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే ఈయన ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’ కోసం పనిచేస్తున్న విషయం తెలిసిందే..అయితే ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!