వేసవికాలం మండుతోంది. సూరీడు ఉదయం నుంచి ప్రచండంగా మారుతున్నాడు. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండల తీవ్రత పెరుగుతూనే వుంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి..మండుతున్న ఎండలతో జనం అల్లాడిపోతున్నారు..ఒకవైపు 45 డిగ్రీలు దాటిన ఎండలు మరో వైపు ఉక్కపోత,వడగాలులతో ఉక్కిబిక్కిరౌతున్నారు..రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ లో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు.
రెండు మూడు రోజులుగా జైనాథ్ ,బేలామండలాల్లో 45 డిగ్రీలుదాటి నమోదు అవుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలతో జనం బెంబేలు ఎత్తుతున్నారు. బయటకు రావాలంటేనే చాలా ఇబ్బందిగా వుందని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మూడు రోజులుగా డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి ఎండలు. గడిచిన 24 గంటల్లో కొమురం భీం జిల్లా కెరమెరి లో 45.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయింది. కౌటాల 45.4 డిగ్రీలు, నిర్మల్.. జిల్లాలోని కడెం పెద్దూర్ లో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా బేల మండలము చప్రాల 45.3 గా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయింది. ఉమ్మడి జిల్లాలో వడదెబ్బతో ముగ్గురు మృతిచెందారు. ఆదిలాబాద్ లో ఒక్కరు , నిర్మల్ జిల్లా భైంసాలో ఇద్దరు మృతి చెందారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని, వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండల తీవ్రతతో కూల్ డ్రింక్స్, కొబ్బరి బొండాలు, పుచ్చకాయలు, శీతల పానీయాలకు గిరాకీ పెరిగింది.
Swetha Varma : బిగ్ బాస్ బ్యూటీకి చేదు అనుభవం… ఎమోషనల్ పోస్ట్