వేసవికాలం మండుతోంది. సూరీడు ఉదయం నుంచి ప్రచండంగా మారుతున్నాడు. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండల తీవ్రత పెరుగుతూనే వుంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి..మండుతున్న ఎండలతో జనం అల్లాడిపోతున్నారు..ఒకవైపు 45 డిగ్రీలు దాటిన ఎండలు మరో వైపు ఉక్కపోత,వడగాలులతో ఉక్కిబిక్కిరౌతున్నారు..రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ లో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. రెండు మూడు రోజులుగా జైనాథ్ ,బేలామండలాల్లో 45 డిగ్రీలుదాటి నమోదు అవుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలతో…