Summer Heroines : సమ్మర్ రేసులో హీరోయిన్ల మధ్య గట్టి పోటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు సమ్మర్ సీజన్ అంటే బాక్సాఫీస్ దగ్గర భారీ పోటీ, స్టార్ హీరోల హడావిడి కనిపించేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. రిలీజ్‌లు తగ్గినా… ఈసారి సమ్మర్ రేసులో హీరోయిన్ల మధ్య మాత్రం గట్టి పోటీ నెలకొంది. క్లాస్, ఎమోషనల్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్… ఈసారి “డెకాయిట్”తో రఫ్ అండ్ టఫ్ అవతార్‌లో కనిపించబోతోంది. ఏప్రిల్ 10న ఈ సినిమా థియేటర్స్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మ్యాస్ట్రో ఫ్లాప్ కావడంతో నభా నటేష్ కెరీర్ లో చాలా గ్యాప్ వచ్చేసింది. ప్రస్తుతం నభా నటేష్ “స్వయంభు”తో రీఎంట్రీ ఇస్తోంది. భారీ పీరియాడిక్ ఫాంటసీ యాక్షన్ ప్రాజెక్ట్ అయినా… ఆమె కెరీర్ ప్రస్తుతం క్రిటికల్ స్టేజ్‌లోనే ఉంది. ఈ సినిమా హిట్ అయితేనే తిరిగి ఫామ్‌లోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read : Megastar Chiranjeevi : ఎన్టీఆర్ నేషనల్ అవార్డు స్వీకరించడంపై చిరు ఎమోషనల్ ట్వీట్…
Also Read
- Hyderabad: హైదరాబాద్‌లో కలకలం.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు మిస్సింగ్.!
- Natural Skin Care: నిమ్మ తొక్కతో హోం బ్యూటీ ట్రీట్మెంట్.. కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
- FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్‌కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
గోల్డెన్ లెగ్ ట్యాగ్‌తో ఉన్న సంయుక్త మీనన్ కూడా “స్వయంభు”తో మరోసారి తన లక్‌ను టెస్ట్ చేసుకుంటోంది. ఇప్పటివరకు వచ్చిన విజయాలు ఆమెకు ప్లస్ అయినా ప్రతి సినిమాతో అదే సెంటిమెంట్ కొనసాగదు అనడానికి అఖండ 2 రిజల్టే నిదర్శనం.. ఈసారి కంటెంట్ స్ట్రాంగ్‌గా లేకపోతే… తన ఇమేజ్ కూడా డౌన్ అయ్యే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. అఖిల్ సరసన “లెనిన్”లో నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సేకు ఇది డూ ఆర్ డై ప్రాజెక్ట్‌లా మారింది. ఇప్పటివరకు చేసిన సినిమాలు పెద్దగా వర్క్ అవ్వలేదు రీసెంట్ గా వచ్చిన ఆంధ్రా కింగ్ తాలూకా అంచనాలు తలకిందులయ్యాయి. దాంతో ఇప్పుడు లెనిన్ సినిమా ఫలితం ఆమె కెరీర్‌ను నిర్ణయించనుంది. హిట్ అయితేనే ఇండస్ట్రీలో నిలబడే అవకాశం ఉంది… లేకపోతే అవకాశాలు మరింత కష్టమయ్యే పరిస్థితి ఉంది. ఈ సమ్మర్ బాక్సాఫీస్ వద్ద కేవలం కలెక్షన్స్ పోటీ మాత్రమే కాదు… హీరోయిన్ల కెరీర్ కోసం జరిగే కీలక పోరాటం కూడా. వీరిలో ఎవరు నిలబడతారు? ఎవరు వెనుకపడతారు? అనేది ఈ సీజన్‌తో క్లియర్ కానుంది.
తాజావార్తలు
-
DMK MLA Markandeyan: డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్.. ఎందుకంటే?
-
Salman Khan: ‘మీరంతా ఎలా ఉన్నారు?’.. అనారోగ్య రూమర్లకు ఒక్క పోస్టుతో చెక్ పెట్టిన సల్మాన్ ఖాన్
-
Hyderabad: హైదరాబాద్‌లో కలకలం.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు మిస్సింగ్.!
-
Harry Brook: వరల్డ్ నంబర్‌వన్ భారత్‌పై రెండు సిరీస్‌లు గెలిచా.. నేను ఫుల్ హ్యాపీ.. మా విజయ రహస్యం అదే!
-
Honor X7e Plus 5G: హానర్ X7e ప్లస్ 5G రిలీజ్.. 8100mAh బ్యాటరీ, Snapdragon 4 Gen 4 చిప్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్‌మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!