Sumanth : నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్న సుమంత్ ‘‘అనగనగా’’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sumanth : అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన వాళ్లలో హీరో సుమంత్ ఒకరు. 1999లో వచ్చిన ప్రేమకథ సినిమాతో హీరోగా అరంగేట్రం చేశారు. తన కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ప్రేమకథ తర్వాత యువకుడు, పెళ్లి సంబంధం, రామా చిలకమ్మ, మహానంది నాగార్జునతో కలిసి స్నేహమంటే ఇదేరా వంటి అనేక సినిమాలతో ఆకట్టుకున్నాడు.
Read Also:Rashmika: ‘పుష్ప 2’ థాంక్స్ మీట్ లో భాగం కాలేకపోయాను: రష్మిక
Also Read
- YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్‌కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
- Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
- Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
సుమంత్ నటించిన చిత్రాల్లో సత్యం, గౌరి, మహానంది, గోదావరి, గోల్కొండ హైస్కూల్, మళ్లీ రావా వంటి హిట్ అయ్యాయి. ఇక సీతారామం సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సైమా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్‌కు నామినేట్ కూడా అయ్యాడు. ఇక, అహం రీబూట్ అనే సినిమాతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు తాజాగా మరో సినిమాతో నేరుగా ఓటీటీలో అలరించేందుకు సుమంత్ రెడీ అయ్యాడు. హీరో సుమంత్ నటించిన లేటెస్ట్ మూవీ అనగనగా.. నేరుగా ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో వ్యాస్ అనే టీచర్‌గా సుమంత్ నటిస్తున్నారు. సన్నీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా స్కూల్ నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది.
Read Also:Warangal: కడియం శ్రీహరికి మాజీ ఎమ్మెల్యే రాజయ్య సవాల్.. ఎమ్మెల్యే కౌంటర్
గతంలో టీచర్స్ డే నాడు విడుదల చేసిన అనగనగా గ్లింప్స్ ఆకట్టుకుంది. తాజాగా ఇవాళ (ఫిబ్రవరి 9) సుమంత్ బర్త్ డే సందర్భంగా అనగనగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో సైకిల్‌పై ఒక బాబు, మహిళతో సుమంత్ కనిపించాడు. వారు వాస్ మాస్టార్ భార్య, కొడుకు అని తెలుస్తోంది. ఇక అనగనగా మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈటీవీ విన్‌లో డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న అనగనగా మూవీలో కాజల్ రాణి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అలాగే, చైల్డ్ ఆర్టిస్ట్ విహర్ష్ మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కృషి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించగా డేట్ ఇంకా బయటకి రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్‌కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
-
TATA Sierra EV: టాటా సియెర్రా ఈవీ రిలీజ్ కు రెడీ..! 500KM రేంజ్, ప్రీమియం ఫీచర్లు
-
Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
-
Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
-
Tollywood : తెలుగులో అప్పట్లో హ్యాట్రిక్ ఫ్లాప్స్.. అయినా వరుస ఛాన్సులు
ట్రెండింగ్
-
Fact Check: హీరోయిన్‌తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..