NTV Telugu Site icon

Suman Kumar: హ్యాట్రిక్‭తోపాటు పది వికెట్లు తీసి సంచలనం సృష్టించిన సుమన్ కుమార్

Suman Kumar

Suman Kumar

Suman Kumar: 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని ఐపిఎల్ 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేయడంతో బీహార్‌ లోని సమస్తిపూర్ నగరం వెలుగులోకి రాగా.. ఇప్పుడు అదే నగరానికి చెందిన సుమన్ కుమార్ ఒకే ఇన్నింగ్స్‌లో హ్యాట్రిక్ తీయడమే కాకుండా.. ఇన్నింగ్స్ లో మొత్తం 10 వికెట్లు పడగొట్టి చారిత్రక ఘనత సాధించాడు. కూచ్ బెహార్ ట్రోఫీ అండర్-19 టోర్నమెంట్‌లో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కుమార్ బీహార్ తరఫున ఆడుతూ ఈ ఘనత సాధించాడు.

Also Read: KTM 250 DUKE Price: బంపర్ ఆఫర్.. కేటీఎం 250పై తగ్గింపు

పాట్నాలోని మొయిన్ ఉల్ హక్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బీహార్ తొలి ఇన్నింగ్స్‌లో 467 పరుగుల భారీ స్కోరు సాధించింది. బీహార్ తరఫున దీపేష్ గుప్తా అజేయంగా 183 పరుగులు చేయగా, పృథ్వీ రాజ్ కూడా 128 పరుగులు చేశాడు. దానికి దీటుగా బ్యాటింగ్ మొదలెట్టిన రాజస్థాన్‌కు మంచి ఆరంభం లభించింది. అయితే, సుమన్ కుమార్ రాజస్థాన్ జట్టులోని మొత్తం 10 వికెట్లను పడగొట్టి విధ్వంసం సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్ లో అతను 33.5 ఓవర్లు బౌలింగ్ చేసి 53 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు.

Also Read: Ola Electric: రూ.39 వేలకే ఓలా స్కూటర్‌.. రూ.499కే బుకింగ్!

ఇక మరోవైపు, ఇన్నింగ్స్ 36వ ఓవర్లో సుమన్ కుమార్ హ్యాట్రిక్ కూడా సాధించాడు. అతను వరుసగా మూడు బంతుల్లో మోహిత్ భగ్తానీ, అనాస్, ఆపై సచిన్ శర్మలను అవుట్ చేశాడు. ప్రస్తుత భారత దేశవాళీ క్రికెట్ సీజన్‌లో ఒక బౌలర్ ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీయడం ఇది రెండోసారి. అతనికి ముందు 2024-2025 రంజీ ట్రోఫీలో హర్యానా తరపున అన్షుల్ కాంబోజ్ కేరళతో జరిగిన పోరులో మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. బీహార్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాకేష్ తివారీ సుమన్ కుమార్‌ గురించి మాట్లాడుతూ.. సుమన్ కుమార్ ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీయడం బీహార్ క్రికెట్‌కు గర్వకారణం. క్రికెట్ పట్ల అతని నైపుణ్యం, నిబద్ధత బీహార్‌లో క్రికెట్ పెరుగుతున్న స్థాయిని చూపిస్తుంది. బీహార్ రాష్ట్రం ఇప్పుడు జాతీయ స్థాయిలో మంచి ఆటగాళ్లను అందిస్తోందని ఆయన అన్నారు.