Site icon NTV Telugu

Tragedy : సె*క్స్‌కు ఒప్పుకోలేదు.. అందుకే చంపేశాం.. సూట్‌కేస్‌లో బాలిక మృతదేహం కేసులో సంచలనం

Rape

Rape

Tragedy : బెంగళూరు నగర జిల్లాలోని ఆనేకల్ తాలూకా, హళచందాపుర రైల్వే బ్రిడ్జ్ సమీపంలో సూట్‌కేస్‌లో లభ్యమైన గుర్తుతెలియని బాలిక మృతదేహం కేసును సూర్యనగర పోలీస్ స్టేషన్ అధికారులు ఛేదించారు. నిందితులు బాలికపై అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేసి, మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి రైల్వే ట్రాక్ పక్కన పారేశారు అని పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఈ కేసులో బీహార్‌కు చెందిన ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో అశిక్ కుమార్‌ (22), ముఖేష్ రాజబన్షి (35), ఇందుదేవి (32), రాజారామ్ కుమార్‌ (18), పింటూ కుమార్‌ (18), కాలు కుమార్‌ (17), రాజు కుమార్‌ (17) ఉన్నారు. నిందితులు మే 20న బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఎ1 నిందితుడు అశిక్ కుమార్‌ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ కాచనాయకనహళ్ళిలో నివసిస్తున్నాడు. మే 13న అశిక్ కుమార్‌ బెంగళూరు నుంచి బీహార్‌కు వెళ్ళాడు. కేవలం రెండు రోజుల్లోనే పక్క గ్రామానికి చెందిన బాలికను తన వలలో పడేశాడు. మే 15న అశిక్ కుమార్‌ బాలికను తనతో పాటు బీహార్ నుంచి బెంగళూరుకు తీసుకువచ్చాడు. మే 18న ఇద్దరూ బెంగళూరు చేరుకున్నారు.

ఆ రోజు బాలికతో కలిసి అశిక్ కుమార్‌ బెంగళూరు నగరాన్ని చుట్టూ తిరిగాడు. ఆ రోజు రాత్రి నిందితుడు అశిక్ కుమార్‌ బాలికను తన బంధువు ముఖేష్ ఇంటికి తీసుకువెళ్ళాడు. మరుసటి రోజు బాలిక లైంగిక చర్యకు సహకరించకపోవడంతో ఆమెతో గొడవపడ్డాడు. ఆ తర్వాత, అశిక్ కుమార్‌ బీర్ బాటిల్‌తో యువతి ప్రైవేట్ భాగాలపై దాడి చేశాడు. అనంతరం, రాడ్‌తో కూడా బాలికపై తీవ్రంగా దాడి చేశాడు. అనంతరం బాలికపై అత్యాచారం చేశాడు. ఈ దాడి అనంతరం, అశిక్ కుమార్‌ బాలికను ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు.

Fraud : వర్కింగ్‌ వీసా పేరుతో మహిళలకు బురిడీ.. చివరికి..!

బాలికను హత్య చేసిన తర్వాత నిందితుడు అశిక్ కుమార్‌ తన బంధువులకు ఈ విషయం చెప్పాడు. ఆ తర్వాత, నిందితులు బాలిక మృతదేహాన్ని ఒక సూట్‌కేస్‌లో పెట్టారు. అందరూ కలిసి క్యాబ్‌లో బాలిక మృతదేహాన్ని హళే చందాపుర రైల్వే బ్రిడ్జ్ సమీపానికి తీసుకువచ్చారు. రైలు పట్టాల కిందకు సూట్‌కేస్‌ను విసిరివేసి పరారయ్యారు. కదులుతున్న రైలు నుంచి విసిరినట్లుగా చిత్రీకరించడానికి నిందితులు ప్రయత్నించారు. ఆ తర్వాత, ఏడుగురు నిందితులు బీహార్‌కు పారిపోయారు.

సూట్‌కేస్‌లో బాలిక మృతదేహం లభించిన కేసును సూర్యనగర పోలీస్ స్టేషన్ పోలీసులు పోక్సో చట్టం కింద నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కదలికలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా నమోదయ్యాయి. నిందితులు సూట్‌కేస్‌లో మృతదేహాన్ని తరలించే దృశ్యాలు కూడా సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల ఆచూకీ పట్టిన పోలీసులు, బీహార్‌లో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. సూర్యనగర పోలీస్ స్టేషన్ పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మృతి చెందిన బాలిక తండ్రి బీహార్‌లో కిడ్నాప్ కేసు నమోదు చేశారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అశిక్ కుమార్‌పై కేసు నమోదైంది. ఈ విషయం గురించి బీహార్ పోలీసులు సూర్యనగర పోలీసులకు సమాచారం అందించారు. అప్పుడు, సూర్యనగర పోలీస్ స్టేషన్ పోలీసులు జరిగిన ఘటనను తెలియజేశారు.

Michael Clarke: ఐపీఎల్ ఆడడంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మపై విశ్వాసం.. ధోనీపై కీలక వ్యాఖ్యలు..!

Exit mobile version