Ambajipeta Marriage Band : అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకుపోతున్న సుహాస్ మూవీ.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో ‘సుహాస్’ నటించిన లేటెస్ట్ మూవీ ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు ‘దుశ్యంత్ కటికినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా. శివాని నగరం హీరోయిన్‌గా నటిచింది. రూరల్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం ఫిబ్రవరి 02న ప్రేక్షకుల ముందుకు వచ్చి అదిరిపోయే టాక్‌తో దూసుకుపోతోంది. కంటెంట్ బాగున్న సినిమాకు విజయం తప్పకుండా దక్కుతుందని అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీ మరోసారి ప్రూవ్ చేసింది. ఈ సినిమా మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 2.28 కోట్లు వసూలు చేయగా.. రెండో రోజుల్లో ఏకంగా రూ.5.28 కోట్లు వసూలు చేసింది. తాజాగా మూడో రోజు కూడా అదే ఫామ్ కొనసాగిస్తూ ఆదివారం కలెక్షన్ల సునామీ సృష్టించింది.ఇక ‘అంబాజీపేట’ ఆదివారం కలెక్షన్స్ చూస్తే.. ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో రూ.8.6 కోట్లు వసూళ్లు రాబట్టింది.భవిష్యత్ లో ఈ మూవీ 14 కోట్ల కలెక్షన్స్ సాధిస్తుంది అని చిత్ర యూనిట్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.ఈ సినిమాలో సుహాస్ హెయిర్ సెలూన్ నడిపిస్తూ మరోవైపు మ్యారేజి బ్యాండు టీంలో కలిసి పనిచేస్తూ శివానీతో లవ్‌లో పడే యువకుడిగా కనిపించాడు. ఈ మూవీలో పుష్ప ఫేం జగదీశ్ ప్రతాప్ బండారి మరియు గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. గీతా ఆర్ట్స్ 2, మహాయణ మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా తెరకెక్కించాయి.
ఈ సినిమా కలెక్షన్స్ పరంగా చుస్తే సుహాస్ కెరీర్లోనే అంబాజీపేట మ్యారేజీ బ్యాండు అతిపెద్ద హిట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో కలర్ ఫొటో మరియు రైటర్ పద్మభూషణ్ లాంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన సుహాస్ కు క్రమంగా ఫాలోయింగ్ పెరుగుతుందనడానికి అంబాజీపేట మ్యారేజీ బ్యాండు మూవీ కలెక్షన్లే నిదర్శనం అని చెప్పాలి. ఈ సినిమాకు ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు.అంబాజీపేట మ్యారేజీ బ్యాండు బ్యూటీఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ లవ్‌స్టోరీ. కుల వివక్ష బ్యాక్‌డ్రాప్‌లో తమిళ డైరెక్టర్స్ కు పోటీగా తెలుగు దర్శకులు కూడా సినిమాలు తీయగలరని చాటిచెప్పే మూవీగా నిలిచింది.. అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాలో ప్రతి ఒక్కరు పోటాపోటీగా నటించారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో హీరో మాదిరిగా ఫైట్స్ చేయడం కాకుండా హీరో పడే సంఘర్షణను రా అండ్ రస్టిక్‌గా దర్శకుడు చూపించాడు. అలాగే శరణ్య పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ సినిమాకు ఎంతో హైలైట్‌గా అనిపిస్తుంది.
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
8.6cr gross in 3 days
Fantastic achievement#AmbajipetaMarriageBand will cross 14cr padmabhushan in future pic.twitter.com/MKXLP2CKQl
— Indian movie biz (@indianmoviebiz) February 5, 2024
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!