Suhana Khan – Agastya Nanda : లండన్ లో అమితాబ్ మనవడుతో షారుక్ కుమార్తె హల్చల్..

  • షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది.
  • గత కొద్దిరోజులుగా షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు.
  • నైట్ క్లబ్‌లో వీరిద్దరి వీడియో వైరల్ కావడంతో చర్చకు మరింత ఆజ్యం.
Agastya Nanda

Agastya Nanda

Suhana Khan – Agastya Nanda : బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కుమార్తెలలో ఒకరైన సుహానా ఖాన్ ఈ మధ్యనే ‘ది ఆర్చిస్’ తో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. నెట్ఫ్లిక్ వేదికగా విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. నేరుగా ఇప్పుడు ” కింగ్ ” సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. యాక్షన్ డ్రామాగా తెరకు ఎక్కబోతున్న ఈ సినిమాని సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ మార్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్స్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

North Korea: K-పాప్, సినిమాలు షేర్ చేయడమే పాపం.. బహిరంగా మరణశిక్షలు విధిస్తున్న కిమ్..

ఇక మరోవైపు నిజ జీవితంలో షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. గత కొద్దిరోజులుగా ఆవిడ అమితాబచ్చన్ మనవడు అగస్త్య నందతో కలిసి డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై వారిద్దరు ఎక్కడ వ్యాఖ్యానించలేదు కూడా. ఇకపోతే తాజాగా లండన్ నగరంలోని ఓ నైట్ క్లబ్ లో వారిద్దరు పార్టీలో ఎంజాయ్ చేస్తూ కనిపించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ది ఆర్టిస్ట్ చిత్రంలో కలిసి పనిచేసిన వీరిద్దరూ ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారంటూ ప్రచారం జరుగగా.. తాజాగా వీరిద్దరు కలిసి ఉన్న వీడియో వైరల్ అవ్వడంతో ఈ చర్చ మరింత ముదిరింది. అయితే సుహానా ఖాన్ ఓ సినిమా షూటింగ్ నేపథ్యంలో ఆవిడ లండన్ వెళ్ళగా.. అదే సమయంలో ఆమె తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి హాజరైంది. ఆ పార్టీలో సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Gun Hulchul: అన్నమయ్య జిల్లాలో కాల్పులు కలకలం.. ఇద్దరు అరెస్ట్..!