NTV Telugu Site icon

Sudha Murthy : రాజ్యసభలో సుధామూర్తి మొదటి ప్రసంగం..బాలికలకు సర్వైకల్ వ్యాక్సిన్ వేయాలని సూచన

Modi

Modi

ఆమె ఇటీవల రాజ్యసభలో అడుగు పెట్టారు. ఇది ఆమె మొదటి ప్రసంగం.. తొలిసారి మాట్లాడేందుకు తడబడ్డారు.. రాజ్యసభ విధానం తెలియకున్నా.. తాను చెప్పాల్సిన అంశాలను క్లుప్తంగా వివరించారు. మహిళాలోకానికి అవసరమయ్యే పలు అంశాలను ప్రస్తావించారు. ఎవరా అనుకుంటున్నారా.. ఆమె పుస్తక రచయిత్రి, దాత, ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి. ఎంపీగా రాజ్యసభలో తొలి ఆమె ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. మహిళల ఆరోగ్యం అంశంపై ఆమె ప్రసంగించారు. దీనిపై తాజాగా ప్రధాని మోడీ స్పందించారు. బుధవారం (జులై) రాజ్యసభకు వచ్చిన పీఎం సుధామూర్తికి కృతజ్ఞతలు తెలియజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సుధామూర్తి రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయ్యారు. ప్రస్తుతం నడుస్తోన్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆమె సభలో మాట్లాడారు

READ MORE: PM Modi: ఒలింపిక్స్ క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన మోడీ

పార్లమెంట్ లో తొలిసారిగా మాట్లాడిన సుధామూర్తి..పార్లమెంట్ లో ఇది తన నామొదటి స్పీచ్ అని తెలిపారు. నాకు ఎంత సమయం ఇచ్చారు? అని స్పీకర్ ని అడిగారు. దీంతో అయిదు నిమిషాల సమయం కేటాయించామని స్పీకర్ సమాధానం చెప్పారు. ఈ అయిదు నిమిషాలు సరిపోకపోయినా నేను ఆసయమంలో చెప్పాల్సింది చెబుతానన్నారు. “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా” అంటూ ఆమె ప్రసంగా ప్రారంభించారు. “9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసులో ఉన్న బాలికలకు సర్వైకల్ వ్యాక్సిన్ ఇస్తారు. ఆ వ్యాక్సిన్ ను తీసుకుంటే క్యాన్సర్ ను అడ్డుకోవచ్చు. చికిత్స కంటే నివారణే మేలు. ఒక కుటుంబంలో తల్లి ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబానికి అది తీరని లోటు. కొవిడ్ సమయంలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించాం. ఆ అనుభవంతో సర్వైకల్ వ్యాక్సిన్ ను బాలికలకు అందించడం సులభం.” అని వ్యాఖ్యానించారు. దీంతో పాటు వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రసంగించారు. సుధామూర్తి చేసిన ఈ ప్రసంగంపై ప్రధాని స్పందించారు. మహిళల ఆరోగ్యంపై సమగ్రంగా మాట్లాడిన సుధామూర్తిజీకి కృతజ్ఞతలని అన్నారు. గత పదేళ్ల కాలంలో ప్రభుత్వం మహిళల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రధానంగా దృష్టి సారించిన విషయాన్ని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేసిందని, గర్భిణీలకు వ్యాక్సినేషన్ తీసుకు వచ్చామని వెల్లడించారు.